కొడాలి తిరుగులేని రివేంజ్‌తో దేవినేనికి దిమ్మ‌తిరిగి పోతోందిగా..!

VUYYURU SUBHASH
కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లో మంత్రి కొడాలి నాని వ‌ర్సెస్ మాజీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు మ‌ధ్య గ‌త ద‌శాబ్ద కాలంగా తీవ్ర‌మైన ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం న‌డుస్తోంది. ఆ మాట‌కు వ‌స్తే వీరిద్ద‌రు టీడీపీలో ఉన్న‌ప్ప‌టి నుంచే వీరికి ఏ మాత్రం పొసిగేది కాదు. ఆ త‌ర్వాత వీరు వేర్వేరు పార్టీల్లో ఉండడంతో ఈ యుద్ధం మ‌రింత తీవ్ర‌మైంది. నాని టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడే ఆయ‌న‌కు ఉన్న క్రేజ్‌, దూకుడు చూసి ఉమా ఓర్వ‌లేక‌పోయే వార‌న్న చ‌ర్చ‌లు టీడీపీ వ‌ర్గాల్లోనే ఉండేవి.

చివ‌ర‌కు పార్టీ కోసం ఎంత క‌ష్ట‌ప‌డుతున్నా ఉమాకే బాబు ప్ర‌యార్టీ ఇవ్వడంతో స‌హించ‌లేక‌పోయినా నాని పార్టీ మారిపోయారు. టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఉమా గుడివాడ వెళ్లి ఊక‌దంపుడు స‌వాళ్లు విస‌ర‌డంతో పాటు నానిని ఎన్నో విధాలా ఇబ్బంది పెట్టాల‌ని ప్ర‌య‌త్నించారు. అయినా నాని గుడివాడ‌లో గ‌త ఎన్నిక‌ల్లో బంప‌ర్ మెజార్టీతో గెలిచి స‌త్తా చాటారు. ఇప్ప‌టి వ‌ర‌కు కొడాలి నానికి ఓట‌మి లేదు. ఉమాకు తొలి ప‌రాభ‌వం త‌ప్ప‌లేదు. వీరిద్ద‌రి మ‌ధ్య పోరులో నాని పై చేయి సాధించాడ‌నే చెప్పాలి.

కొడాలి నాని అటు చంద్ర‌బాబు, లోకేష్‌నే కాకుండా.. ఉమా గాడు ఆడా, మ‌గా కాద‌ని ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుంటారు. చివ‌ర‌కు నాని వ్యాఖ్య‌ల‌కు ఉమా కౌంట‌ర్ ఇచ్చే ప‌రిస్థితి కూడా లేకుండా పోయింది. ఒక వేళ ఉమా నానిపై పంచ్‌లు విసిరినా అవి ఏ మాత్రం పేలే ప‌రిస్థితి లేదు. ఆ రేంజ్‌లో ఉమాపై నాని పై చేయి సాధించాడ‌నే చెప్పాలి. చివ‌ర‌కు నానిపై ఏదైనా విమ‌ర్శ చేస్తే వెంట‌నే లైన్లోకి వ‌చ్చి ఎక్క‌డ తాట తీసి.. ఉతికి ఆరేస్తార‌న్న ఆందోళ‌న‌లో ఉమా ఉన్నారు. తాజాగా మ‌రోసారి ఉమా నానికి ఓ ఉత్తుత్తి స‌వాళ్లు రువ్వారు. మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తాను దీక్ష చేపడతానని దేవినేని ఉమ స్పష్టం చేశారు.

మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు దిగుతానని, టచ్ చేసి చూడాలని దేవినేని ఉమ సవాల్ విస‌ర‌డంతో పాటు నాని త‌న‌పై, చంద్ర‌బాబు పై చేసిన ఆరోప‌ణ‌ల‌ను నిరూపించాల‌న్నారు. త‌న‌తో చ‌ర్చ‌కు ముఖ్య‌మంత్రి వ‌స్తారో ?  కొడాలి నాని వ‌స్తారో ?   తేల్చుకోవాల‌న్నారు. ఏదేమైనా నాని దెబ్బ‌కు ఉమాకు మైండ్ బ్లాక్ అయ్యి ఏం చేయాలో తెలియ‌క చివ‌ర‌కు రాజ‌కీయంగా ఉనికిని చాటు కునేందుకు ఏదో ఒక జిమ్మిక్కుతో మీడియాలో ఉండేందుకు చూస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: