అమెరికా కొత్త అధ్యక్షుడికి ప్రాణ హాని...!
అంతే కాకుండా ట్రంప్ కు సంబంధించిన అభిమానులు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇన్ని అనూహ్య పరిణామాల మధ్య ఇప్పుడు ఇంకొక్క విషయం ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది. అయితే రేపు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జో బైడెన్ కు ప్రాణహాని ఉందని, అయితే ఈ ప్రమాదం కూడా అతనితో ఉండే తన రక్షణ సిబ్బంది వలనే కలుగుతుందని హెచ్చరికలు మొదలయ్యాయి. దీనితో అప్రమత్తమైన అమెరికా రక్షణ అధికారులు ఎవరైతే రేపు విధులకు హాజరవుతారో వారితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. పైగా నగరం మొత్తాన్ని మిలిటరీ కంటోన్మెంట్ జోన్ గా మార్చేశారు. ఎన్నడూ లేనంతగా 25 వేల మంది జాతీయ గార్డులతో వాషింగ్టన్ డీసీ నగరాన్ని అష్టదిగ్బంధనం చేశారు.
అంతర్గత దాడులు జరిగే ప్రమాదం ఉండడంతో సిబ్బంది మొత్తాన్ని జాగ్రత్తగా తనిఖీ చేస్తున్నారు. ఏ విధమైన అల్లర్లు కానీ, దాడులు కానీ జరగకూడదని, అలా చూసుకునే బాధ్యత కమాండర్లదని రక్షణ శాఖ కార్యదర్శి అలెర్ట్ చేశారు. ప్రమాణ స్వీకారం జరిగే ప్రదేశంలో ఎవరిపైనైనా అనుమానం కలిగితే వెంటనే వారిని పోలీసులకు అప్పగించాలని చెప్పారు. ఇప్పుడు ట్రంప్ అభిమానులు.. శ్వేతజాతి అహంకార వాదులు.. అతివాదులు సైతం దాడులు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు అమెరికాలో రక్షణ అధికారులంతా ఈ గందరగోళంపై తర్జన భర్జన అవుతున్నారు.
సైనికులలో కానీ, లేదా ఎయిర్ ఫోర్స్ ఉద్యోగుల్లో కానీ ఎవరైనా అసభ్య పదజాలంతో మాట్లాడితే వారిని వెంటనే పోలీసులకు అప్పగిస్తాము. లేదంటే అక్కడే వారిపై చర్యలు తీసుకుంటామని జనరల్ డేనియల్ ఆర్ హోకన్ సన్ స్పష్టం చేశారు. ఇదంతా ఇలా ఉంటే ఈ విషయం గురించి తెలిసిన బైడెన్ మద్దతుదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరి ఇంతకీ రేపు జరగబోయే నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం ఏ ఆటంకం లేకుండా జరగాలని ఆశిద్దాం.