షాకింగ్: రాజకీయాలకు కేసీఆర్ గుడ్ బై

బిజెపి మహిళా మోర్చా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బిజెపి నేత విజయశాంతి హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై విజయశాంతి ఫైర్ అయ్యారు. మహిళలపై అత్యాచారాలను నియంత్రిచటంలో సీఎంగా కేసీఆర్ విఫలమయ్యారని విమర్శలు చేసారు. ఎన్కౌంటర్ చేయటమే సమస్యకు పరిష్కారం కాదు అని ఆమె అన్నారు. మహిళల భద్రత కోసం చట్టాలను సరిగ్గా అమలు చేయటంలో కేసీఆర్ కు చేతకావటంలేదు  అని ఆమె మండిపడ్డారు. టీఆర్ఎస్ లో రౌడీలున్నారా?  ముఖ్యమంత్రి కంటే ఎక్కువ బూతులు మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు.
బిజెపిని చించేయమని టీఆర్ఎస్ నేతలు రెచ్చగొడ్తున్నారు అని అన్నారు. వ్యాక్సినేషన్ సమయంలో ప్రజలకు ధైర్యం ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి ఫాంహౌస్ నుంచి  బయటకు రాలేదు  అని ఆరోపించారు. బహుశా కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకున్నాడనుకుంటాను అని ఆమె పేర్కొన్నారు. టీఆర్ఎస్ లో ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి నేతవరకు బూతులే మాట్లాడుతున్నారు అని ఆమె వ్యాఖ్యానించారు.  టీఆర్ఎస్ పాలనలో విచ్చల విడిగా దోపిడీలు, కబ్జాలతో రాష్ట్రం నాశనం అయ్యింది అని మండిపడ్డారు.
టీఆర్ఎస్ దోపిడీ దొంగలను ప్రజల ముందు దోషిగా నిలబెడతాం అని ఆమె వెల్లడించారు.బిజెపిఅధికారంలోకొస్తే.. తెలంగాణ రూపురేఖలు మారతాయి అని ఆమె అన్నారు. తెలంగాణలో మళ్ళీ 
 ఉద్యమం రావాల్సిన అవసరముంది అని ఆమె వెల్లడించారు. తెలంగాణ ప్రజలు అమాయకులు.. వారిని ఎడ్యుకేట్ చేసే బాధ్యత మనపై ఉంది అని ఆమె అన్నారు. దుబ్బాక లో జీహెచ్ఎంసీలో మహిళలు పెద్ద పాత్ర పోషించారు అని ఆమె తెలిపారు. మూడేళ్ళ పాటు ఓపిక చేసుకుని కష్టపడితే బిజెపి ని అధికారంలోకి తీసుకురావచ్చు అని అన్నారు. సమాజంలో ఎన్నో కష్టసుఖాలను మోసేది మహిళ. ఇంటిని తీర్చిదిద్దేది మహిళ అని ఆమె తెలిపారు. ఆడది ఆదిపరాశక్తి.. ఎప్పుడు ఏపాత్ర పోషించాలో తెలుసు అని అన్నారు. మహిళలను ప్రోత్సహిస్తే.. వెనకపడిపోతామని కొంతమంది పురుషులు అనుకుంటారు అని ఆమె అన్నారు. మహిళ లను ఎదుర్కునే శక్తి లేకనే సోషల్ మీడియాలో మహిళ లను కించపర్చేలా పోస్ట్ లు పెడతారు అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: