యువతిపై సామూహిక అత్యాచారం..షాక్ లో పోలీసులు ఎందుకంటే..!?

N.ANJI
సమాజంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. ఎదోఒక్క ప్రాంతంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఓ యువతీపై సామూహిక అత్యాచారం చేసి, సజీవంగా దహనం ప్రయత్నం చేశారంటూ ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది. అయితే, యువతి మాటలు నమ్మే విధంగా లేకపోవడంతో.. వీటిని రుజువు చేసే సాక్షాధారాలు లేవంటూ ఇండోర్ పోలీసులు చేతులెత్తేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే..  ఓ 18 ఏళ్ల అమ్మాయి.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సిటీలో ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా.. అక్షయ్ గుప్తా అనే తన స్నేహితుడు, అతని మిత్రుడు కలిసి తనకు మత్తు మందు ఇచ్చారని ఆమె తెలిపింది. అనంతరం వారు ఆమెను సమీపంలోని భగీరథ్పురా రైల్వే ట్రాక్స్ వద్దకు బలవంతంగా తీసుకెళ్లారని బాధితురాలు ఆరోపణలు చేశారు. అక్కడ అప్పటికే తమకోసం వేచి చూస్తున్న మరో ముగ్గురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, కత్తితో పొడిచి, ఆతరువాత గోనెసంచిలో చుట్టి, సజీవ దహనం చేసే ప్రయత్నం చేసినట్టు యువతి ఆరోపిస్తోంది.
అయితే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలికి కాబోయే భర్త ఆమెను రక్షించిన విధానం వివరించాడు. బాధితురాలు, ఆమె ఫియాన్సీని తీసుకుని సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు.. అక్కడ అలాంటివి జరిగినట్టు ఏమాత్రం ఆనవాళ్లు లేవని, సాక్షాధారులు కూడా కనిపించలేదని చెబుతున్నారు. పైపెచ్చు అమ్మాయిపై చిన్న గాయం అయింది కానీ లోతైన గాయాలు కత్తి పోట్లు వంటివేం లేవని ఆమెకు చికిత్స చేసిన వైద్యులు స్పష్టం చేశారు.
ఇక బాధితురాలి కథనం ప్రకారం అక్షయ్ ని అతను ఉంటున్న ఇంటి నుంచే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తనకేం తెలియదని అతను వాదిస్తుండటంతో కథ మలుపులు తిరిగింది. అంతేకాక మరోవైపు అమ్మాయి ఆరోపణలకు బలం చేకూర్చే సాక్షాలు ఏమాత్రం లేకపోవటంతో ఇదంతా కల్పితంగా, దీనివెనకున్న కారణం ఏంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: