బాబు ని మర్చితే సరి ! ' కమ్మ ' ల్లో కొత్త చర్చ ఏంటి ?

చాలా కాలంగా ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు తెలుగుదేశం పార్టీ లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ తీవ్ర ఒడిదుడుకులను తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటున్న వైసీపీ 2019 ఎన్నికల్లో విజయం సాధించిన దగ్గర్నుంచి ఈ రకమైన ఇబ్బందులు ఎక్కువ అయ్యాయి. పూర్తిగా వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున మీరు ఇబ్బంది పెట్టే ఆహారాలు చేసినట్లుగానే పరిస్థితులు కనిపిస్తుండటం తెలుగుదేశం పార్టీలోనే కాకుండా సామాజిక వర్గం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చంద్రబాబు పై ఉన్న కోపంతో రాజకీయంగా కమ్మ సామాజిక వర్గం మొత్తాన్ని వైసీపీ ప్రభుత్వం తగ్గి చేసుకుని కోపంతో పూర్తిగా తమ సామాజిక వర్గం ను జగన్ దూరం పెట్టడంతో పాటు, ఎటువంటి ప్రయోజనాలు అందకుండా అన్ని రకాలుగాను అడ్డం పడుతున్నారనే ఆందోళన ఆ సామాజికవర్గ నాయకుల్లో నెలకొంది.





 ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు వల్ల కమ్మ సామాజిక వర్గం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ముందు ముందు చంద్రబాబు కారణంగా పార్టీకి కానీ, తమ సామాజిక వర్గానికి కానీ పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చనే అంచనాకు కమ్మ సామాజిక వర్గం పెద్దలు వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే బాబు కాకుండా మరో ప్రత్యామ్నాయ నేతను టిడిపిలో హైలెట్ చేయాలని విషయంపైనా ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోందట. చంద్రబాబు తనయుడు లోకేష్ వల్ల రాజకీయంగా, సామాజికంగా పెద్దగా ఉపయోగం ఉండదు అనే అభిప్రాయం ఉండడంతో, ఏదో రకంగా జూనియర్ ఎన్టీఆర్ ను తెరపైకి తెచ్చేందుకు కమ్మ సామాజిక వర్గం పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 




ఆయన అయితేనే కమ్మ సామాజిక వర్గంతో పాటు టిడిపికి కలిసి వస్తుందనే లెక్కల్లో ఆ సామాజిక వర్గం కీలక వ్యక్తులు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పట్లో టిడిపి లోకి వచ్చేందుకు గాని, సామాజిక పరంగా యాక్టివ్ అయ్యేందుకు కానీ జూనియర్ ఇష్టపడకపోయినా, జూనియర్ ను మాత్రం ఏదో రకంగా ఒప్పించి చంద్రబాబు కి ప్రత్యామ్నాయ నేతగా తీర్చిదిద్దాలి అనే లెక్కల్లో కమ్మ సామాజిక వర్గ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. 







మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: