పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌... సీఎం జ‌గ‌న్‌పై విజ‌యం...

Spyder
ఆరు నూరైనా... నూరు ఆరైనా ఏపీలో గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సిందేనంటూ ప‌ట్టుబ‌ట్టిన ఎన్నిక‌ల రాష్ట్ర క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ చివ‌రికి త‌న పంతం నెగ్గించుకున్నారు. ఇప్ప‌టికే ఎన్నిక‌ల‌కు  షెడ్యూల్ ప్ర‌క‌టించిన క‌మిష‌న్ అంతేనేర్పుగా ఎదురైన న్యాయ ఆటంకాల‌ను కోర్టులోనే ప‌రిష్క‌రించుకుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ సీఎం జగన్ కు షాకిస్తూ ఏపీలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో  సింగిల్ జడ్జి తీర్పును హైకోర్ట్ కొట్టివేసింది. రాష్ట్రఎన్నికల సంఘం అప్పీల్ పై హైకోర్ట్ లో వాదనలు ముగిశాయి. కరోనా వ్యాక్సినేషన్ కారణంగా ఎన్నికల్ని వాయిదా వేయడంపై ఎస్ఈసీ కోర్ట్ రిట్ పిటిషన్ వేసింది.

ఆ పిటిషన్ విచారణ సందర్భంగా ఎస్ఈసీ తరుపు న్యాయవాది ఆదినారాయణరావు.. వ్యాక్సినేషన్ కు ఎన్నికలు అడ్డుకాదని వాదనలు వినిపించారు. ఇరు పక్ష వాదనల్ని విన్న హైకోర్ట్ రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికలు నిర్వహించాలని తీర్పిచ్చింది. ఈ తీర్పుతో త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.  పంచాయతీ ఎన్నికలు కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ తీర్పుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు.హైకోర్టు ఆదేశాల ప్రకారం 4 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.

మొత్తానికి నిమ్మ‌గ‌డ్డ అనుకున్న‌ది సాధించార‌న్న చ‌ర్చ ఏపీ, తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఏపీ పంచాయ‌తీ ఎన్నిక‌ల వివాదం జాతీయ‌స్థాయిలో చ‌ర్చ జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. దీనిపై అటు బీజేపీ కూడా కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లింది. ఒక్క కాంగ్రెస్, వైపీపీ మిన‌హా మిగ‌తా రాజ‌కీయ ప‌క్షాల‌న్నీ కూడా హైకోర్టు ధ‌ర్మాస‌నం తీర్పును స్వాగ‌తించాయి. మరోవైపు హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్ట్‌ను ఆశ్రయించనుంది. రెండు రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఇవ్వాళ, లేదంటే రేపు రాష్ట్రప్రభుత్వం ఎన్నికల్ని వాయిదా వేసేలా సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: