తెరాస ను విమర్శించే విషయంలో ప్లాన్ మార్చిన రేవంత్ రెడ్డి...!
కానీ ఇప్పుడు ఆయన టార్గెట్ కేసీఆర్ కాదు కేటీఆర్ అని అంటున్నారు కొందరు రాజకీయ నేతలు. దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం తెలంగాణలో టిఆర్ఎస్ స్థాపకుడు కేసీఆర్ పార్టీ పగ్గాలు తన కుమారుడు కేటీఆర్ కు అప్పగించే పనిలో నిమగ్నమై ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి కానున్నారు అనే విషయం గురించి ఇప్పటికే బీజేపీ స్పందించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై రేవంత్ రెడ్డి ఇంకా స్పందించకపోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రాజాకీయ వర్గాల సమాచారం ప్రకారం గతంలో ఎన్నో సార్లు కేటీఆర్ ని లక్ష్యం చేసుకుని అనేక ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి... ఇప్పుడు కొత్తగా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు.
ఈ ఆరోపణలలో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో కేటీఆర్ నిర్మించిన ఫామ్ హౌస్ అక్రమమని చెప్పడం ప్రధానమైనది. అప్పట్లో దీనిపై కేటీఆర్ కూడా స్పందించి తగిన వివరణ ఇవ్వడం జరిగింది. ఇకపై పూర్తిగా తాను వేసే వ్యూహాలన్నీ కేటీఆర్ ప్రధాన లక్ష్యంగా ఉండాలని పార్టీ నేతలు చెప్పుకుంటూ ఉన్నారు. కాగా ఇప్పటి వరకు రావెన్త్ రెడ్డి కేసీఆర్ మీద తన వాక్చాతుర్యాన్ని చూపిస్తూ వచ్చారు, ఇకపై ఇలా చేస్తే పార్టీకి వచ్చే లాభం ఏమీ లేదని, ఇకపై కొత్త ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడానికి సిద్ధమవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి కేసీఆర్ తో పోల్చుకుంటే కేటీఆర్ రేవంత్ రెడ్డి మాటల దాడి నుండి ఏవిధంగా తప్పించుకోనున్నాడో అతి త్వరలోనే తెలియనుంది.