ఆన్లైన్ క్లాసులు అర్థం కాక విద్యార్థి ఏం చేసాడో తెలుసా.. పేరెంట్స్ షాక్..?

praveen
కరోనా  వైరస్ పుణ్యమా అని ఎప్పుడు బడికి వెళ్లి తోటి విద్యార్థులతో ఎంతో హాయిగా ఆడుకుంటూ.. ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకుంటూ.. జాలీగా గడిపే విద్యార్థులు అందరూ కూడా ప్రస్తుతం కేవలం ఒకే ఒకగదికి ఒక చైర్ కి మాత్రమే పరిమితం అయ్యారు అనే విషయం తెలిసిందే. కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి విద్యాసంస్థలు మొత్తం మూతపడ్డాయి. ఇక ఆ తర్వాత విద్యా సంస్థలు తెరుచుకోవాలని అనుకున్నప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య కుదరలేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక విద్యార్థులు ఆన్లైన్ తరగతులు వినాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 అయితే సాధారణంగా పిల్లలు స్కూల్ కీ  వెళ్లి ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకుంటూ  ఎంతో శ్రద్ధగా ఉపాధ్యాయులు చెప్పేది వింటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఆన్లైన్ క్లాసులలో ఉపాధ్యాయులు ఎంత బాగా చెప్పినప్పటికీ అటు విద్యార్థులు మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ తల్లిదండ్రులు మాత్రం తప్పనిసరిగా ఆన్లైన్ క్లాసులు వినాలి అని చెబుతున్న నేపథ్యంలో అటు ఆన్లైన్ క్లాసుల్లో  చెప్పేది అర్థం చేసుకోలేక తల్లితండ్రులు చేస్తున్న ఒత్తిడి తట్టుకోలేక చివరికి చిన్న వయసులోనే కఠిన నిర్ణయం తీసుకుంటున్నారు ఎంతోమంది విద్యార్థులు.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.  ఆన్లైన్ క్లాసులు అర్థం కాక పోవడంతో ఎనిమిదవ తరగతి విద్యార్థి కీలక నిర్ణయం తీసుకుని తల్లిదండ్రులకు షాక్ ఇచ్చాడు. ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా ఎక్కడికో పారిపోయాడు.  సూరత్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటి నుంచి పారిపోతూ ఒక లెటర్ రాసి వెళ్ళాడు ఆ విద్యార్థి. ఆన్లైన్ క్లాసులు వింటూ ఉంటే ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదని.. మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టాను అని.. అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను క్షమించండి అంటూ లెటర్ రాసి వెళ్ళిపోయాడు అయితే ఆ బాలుడు మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: