మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..!?

N.ANJI
చాలా మందికి జీవితంలో మలబద్ధకం ఒక పెద్ద సమస్య. మానవునికి వచ్చే చాలా రకాల వ్యాధులకు 'మలబద్ధకమే' మూల కారణంగా ఉంటుంది. ఇక పిల్లల్లోనైనా, పెద్దల్లోనైనా విరేచనం సాఫీగా కాకపోవడమో లేదా ముక్కి ముక్కి అతి కష్టమ్మీద వెళ్లాల్సిరావడమో జరుగుతుంటే అది మలబద్ధకంగా పరిగణించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అయితే కొంతమందికి తమకు రోజూ విరేచనం కావడం లేదు కాబట్టి ఈ సమస్య ఉందని అనుకుంటారు.

అయితే నేటి ఆధునిక జీవన విధానం కారణంగా ఈ సమస్య ఈ రోజుల్లో పిల్లలలో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సమస్య ఉన్న పిల్లలు మిగతా చిన్నారుల లాగా ఎక్కువగా సరదాగా ఉండకుండా ఇబ్బంది పడుతుంటారు. కొన్ని చిట్కాలను పాటిస్తే పిల్లలలో సాధారణ మలబద్దక సమస్యలను మనం సింపుల్ గా పరిష్కరించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

ఇక కనీసం వారంలో మూడుసార్లు మలవిసర్జన చేయడంలో సమస్య ఎదురుకావడంతో పాటు ఆ ప్రక్రియ చాలా కష్టంగా జరుగుతుంటే దాన్ని మలబద్ధకం అనుకోవచ్చు. చాలా సందర్భాల్లో ఇది అంత తీవ్రమైన సమస్య కాదు. అయితే సమస్య తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే తప్పక డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. మెులకెత్తిన గింజలు (స్ప్రౌట్స్‌) ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది. పొట్టుతో ఉన్న ధాన్యాలు (జొన్న, రాగి), పొట్టుతో ఉండే గోధువులు, వుుడిబియ్యం, పొట్టుతోనే ఉండే పప్పుధాన్యాలు వంటివి తీసుకోవడం వల్ల కూడా మలబద్ధకాన్ని నివారించవచ్చు.

అరటి మలబద్ధకం సమస్యకు మెడిసిన్ గా పనిచేస్తుంది. ఇది మలబద్ధకం నివారణకు సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలను అధికంగా ఇవ్వాలి. ఈ రకమైన కూరగాయలు మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి. నీరు ఎక్కువ తాగడం వలన మలబద్ధకం సమస్య పరిష్కారం అవుతుంది. మలబద్ధకం ఉన్నప్పుడు, ఎక్కువ నీరు తాగడం అలవాటు చేసుకోవడం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది. దీంతో పాటు ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల కిడ్నీ సమస్యలు కూడా రావు.









మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: