ఢిల్లీ వెల్లిన రోజే మునిగిన పల్లె

అమ్మ దగ్గరికి వెలితే అంతో ఇంతో ఇస్తుంది అనుకుంటారు. కాని మన సిఎం ఎప్పుడు ఢిల్లి వెల్లినా ఏదో ఒకటి పోగొట్టుకోవడం తప్ప తెచ్చింది ఏది లేదు. ఓసారి వెలితే సిలిండర్ పేలింది, ఇంకోసారి కరెంటు పోయింది..ఇలా జరిగినవి ఎన్ని చెప్పినా తక్కువే. తాజాగా ఢిల్లీ వెలితే ఏపి పల్లెలు కెవ్వు మని కేకలు వేసేలా చేసింది కేంద్రం.  పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు అని నమ్మే దేశం మనది. అందుకే పల్లె సీమల అభివృద్దికి కేంద్రం నేరుగా రాష్ట్రాలకు పంచాయతీల అభివృద్దికి ప్రతి ఏటా కోట్లాదిరూపాయలిస్థుంది. వాటిని మన సిఎం డిల్లి వెల్లిన రోజే కేంద్ర గనులు,పంచాయతిరాజ్ శాఖ మంత్రి కిషోర్ చంద్రదేవ్ అన్ని రాష్ట్రాలకు విడుదల చేసారు. అక్కడే ఉన్న మన ముఖ్యమంత్రి ఆయనను కలసి ఓరూపాయి ఎక్కువ తెస్తారనుకుంటే ఎందరినో కలసిన ఆయనకు సదరు మంత్రిని కలిసే తీరికే దొరకలేదు. సరే ఎక్కువ మనకెందుకు అనుకుంటే సదరు కేంద్రమంత్రి అసలుకే ఎసరు పెట్టారు.  ఈసారి ఏపి పంచాయతీలకు నిధులివ్వడం లేదు అంటూ మొండి చేయి చూపారు. ఇదెక్కడి అన్యాయం అని అడగక ముందే మనచేయి మన తలమీదే పెట్టారు. నిధులున్నాయట, వాటిని ఖర్చు చేయరట, భద్రంగా దాచిపెడతారట, మల్లీ ఇస్తారట. అదెప్పుడు అని కూడా అడిగే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఎప్పుడిస్తారో చెప్పేసారు, అది విన్నాక మన పాలకుల గూబ గుయ్యి మంది. ప్రస్థుతం రాష్ట్రంలోని పల్లెలకు పాలకులు లేరు, వారు వచ్చాక ఇస్తామన్నారు.  పాలకులు రావాలంటే ఇప్పుడు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. అన్ని కాకపోయినా పంచాయతి ఎన్నికలు నిర్వహించినా సరే ఆనిధులను ఇస్తామన్నారు. అవి నిర్వహించే పరిస్థితుల్లో మన పాలకులు లేరు. ఎందుకంటే ప్రజాతీర్పు కోసం వెలితే పళ్లు రాలేలా ఉన్నాయి పరిస్థితులు. అంటే ఇక మనకు కేంద్రం నిధులు రావన్నమాట, రాష్ట్రంలో ఎలాగు నిధులు లేవు. మొత్తం మీద మన పట్టుకొమ్మలు ఎండిపోయి రాలిపోవాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: