టీఆర్‌ఎస్‌లో చేరనున్న నాగం, చారి

రాష్ర్టంలో రాజకీయ నేతల వలసలు జోరందుకుంటున్నాయి. త్వరలోనే నాగం జనార్ధన్‌రెడ్డి, వేణుగోపాలచారిలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరే అవకాశం ఉందని, అందరు కలిసి పనిచేసి లక్ష్యాన్ని సాధించుకుంటామని సీనియర్ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి తెలిపారు. త్వరలో వారిద్దరిని కూడా కేసీఆర్‌ పార్టీలోకి ఆహ్వానిస్తారని ఆయన చెప్పారు.  ఓ టీవీ చానల్ చర్చలో పాల్గొన్న హరీశ్వర్ రెడ్డి బుధవారం ఈ విషయాన్ని తెలిపారు. నాగం జనార్ధన్ రెడ్డి చిత్తశుద్ది గల నాయకుడని, ఆయనతో కలిసి తాను, వేణుగోపాలచారి ఉద్యమంలో పాల్గొంటామని, తెలంగాణ కోసం మరింత బలంగా పోరాడాల్సిన అవసరం దృష్ట్యా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నానని హరీశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ పరిణామాలతో రాష్ర్ట రాజకీయ ముఖచిత్రం మారిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: