మన జనం అవినీతిని పట్టించుకోరా!

అవినీతి మరక ఏ రాజకీయ పార్టీనీ వదలలేదు. తమ అనుకూలతను బట్టి చాలా మంది వందలు, వేళ్ళ కోట్లు మింగినా అసలు అందులో ఎంతమందికి శిక్ష పడుతుందో భారత దేశంలో బహిరంగ రహస్యం. రెండు ఎకరాల నుండి రెండువేల కోట్లు అని బాబు ఫై,తమ్ముడి ద్వారా కలెక్షన్ లు చేసుకుంటున్నాడని సిఏం ఫై ఆరోపణలు ఉన్నా అవేమి జనం పట్టించోకోవట్లేదు, కనీసం దర్యాప్తు కూడా జరగదు. ఇక జగన్ సంగతి సరే సరి, ఆయన జైలు కు వెళ్ళింది సోనియా వల్ల అని ఆయన అభిమానులు కన్నీటి పర్యన్తమయినా , దాదాపు నలభయ్ వేల కోట్లు తిన్నాడు అన్న ఆరోపణలు అస్సలు పట్టించుకోరు. అందరూ తింటున్నారు, ఎవ్వరూ మినహాయింపు కాదు, మరి మాకు కావలిసినది మాకు ఇస్తే చాలు, మీకు కావాల్సింది మీరు తీసుకోండి అన్నట్లుంది మన జనం సంగతి చూస్తే. ఇదేదో చాలా సులువు గా తీసుకుంటే వచ్చే ఎన్నికల నాటికి 'నువ్వు వెయ్యి కోట్లు తిని యాభయ్ కోట్లు జనానికి ఇచ్చావు' కాని నేను లక్ష కోట్లు తిన్నా ఇరవయ్ వేల కోట్లు జనానికి ఇచ్చాను' అని మన నాయకులు తిట్టుకున్నా ఆశర్య పోవాల్సిన పనిలేదు. జనం చూసేది తమకు యాభయ్ కోట్లు వచ్చిందా ఇరవయ్ వేల కోట్లు వచ్చిందా అనే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: