తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త... ప్రమోషన్ మరియు జీతాల పెంపు...!
తర్వాత సీఎం అన్నింటినీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు.
ఈ క్రమంలో ఉద్యోగుల పీఆర్సీ, ప్రమోషన్లు, మరియు ఇతర ఉద్యోగ సమస్యలపై వెంటనే త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిపి వీటిపై నివేదిక ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ రజత్ కుమార్ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నాయకులతో కీలక అంశాలను దృష్టిలో ఉంచుకొని చర్చ ప్రారంభించి నివేదిక సమర్పించాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. ఈ చర్చ అనంతరం ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఉద్యోగ జీతాలలో సవరణ, పదోన్నతి అంశాలపై ఓ నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం.
అంతేకాక మహిళా ఉద్యోగుల భద్రతపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు సీఎం. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు సౌకర్యాల విషయాలలోనూ, భద్రత విషయంలోనూ ఏ మాత్రం అశ్రద్ధ ఉండకూడదని... ఇప్పుడు ఇంకా ప్రత్యేక చర్యలు తీసుకుని వారికి భద్రత పెరిగేలా మార్పులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు కేసీఆర్. అంతే కాదు....వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ మహిళా ఉద్యోగులతో ప్రత్యేకంగా మాట్లాడారు వారి సమస్యలను తెలుసుకొని మీరు సౌకర్యవంతంగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ బాధ్యతలను తన కార్యదర్శి స్మిత సబర్వాల్ కు అప్పగించి పరిశీలించాలని తెలిపారు. కొత్త మార్పులు తీసుకురావాలని పేర్కొన్నారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు.