మొబైల్ లో డార్క్ మోడ్.. కళ్ళకు మంచిదేనా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..?
ఇక గంటల తరబడి ఎలక్ట్రానిక్ డివైస్ లు వాడుతున్నారు ఎంతోమంది. ఈ క్రమంలోనే ఎలక్ట్రానిక్ డివైస్ ల నుంచి వస్తున్న లైటింగ్ కారణంగా కళ్లు దెబ్బతిని ఎంతోమంది కంటిచూపు సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఎలక్ట్రానిక్ డివైజ్ లు ఉపయోగించే సమయంలో డార్క్ మోడ్ అనే సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చారు. రాత్రి సమయంలో డార్క్ మోడ్ లైటింగ్ తో ఎలక్ట్రానిక్ డివైస్ ఉపయోగించడం వల్ల కళ్లకు ఎలాంటి ఎఫెక్ట్ పడదు అని అందరూ అనుకుంటారు.
కానీ అదంతా వట్టి మాటలే అని అంటున్నారు నిపుణులు. డార్క్ మోడ్ లో ఎలక్ట్రానిక్ డివైస్ చూసినప్పటికీ కళ్ళపై ప్రభావం పడకుండా ఆపలేదు అంటూ చెబుతున్నారు నిపుణులు. కళ్లను రక్షించడంలో డార్క్ మోడ్ ఏమాత్రం సహాయపడదట. అంతేకాకుండా తలనొప్పి, ఇక కళ్లపై ఒత్తిడి తగ్గించడంలో కూడా డార్క్ మోడ్ పని చేయదట. కేవలం ఎలక్ట్రానిక్ డివైస్ స్క్రీన్ నుండి వచ్చే నీలి కాంతిని మాత్రమే డార్క్ మోడ్ తగ్గిస్తుందట. కళ్లపై ఎక్కువగా భారం పడకుండా కాస్త తేలిగ్గా ఉండేందుకు ఉపయోగపడుతుందట. అంతేకాకుండా త్వరగా నిద్ర పట్టేందుకు కూడా ఉపయోగపడుతుంది డార్క్ మోడ్.