హిందూపురంలో 'ఫ్యాన్' పాలిటిక్స్: ఫస్ట్ టైం బాలయ్యకు...?
అయితే ఇక్కడ బాలయ్య, స్థానిక ఎన్నికలని ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఎందుకంటే 2014 ఎన్నికల ముందే స్థానిక ఎన్నికలు జరిగాయి. ఇక ఆ తర్వాత ఇప్పుడే జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు స్థానిక ఎన్నికలని ఎదురుకోవడం ఇప్పుడు బాలయ్యకు మొదటిసారి. దీంతో అందరి దృష్టి హిందూపురం నియోజకవర్గంపై పడింది. ప్రస్తుతం ఎలాగో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి, హిందూపురంలో ఆ పార్టీ హవానే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. కాకపొతే హిందూపురంలో టీడీపీని తక్కువ అంచనా వేస్తే దెబ్బ తిన్నట్లే ఎందుకంటే గత ఎన్నికల్లోనే ఇక్కడ బాలయ్య ఓడిపోతారని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా బాలయ్య మంచి మెజారిటీతో వైసీపీపై విజయం సాధించారు.
ఇప్పుడు పంచాయితీ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని బాలయ్య చూస్తున్నారు. వైసీపీని దెబ్బ కొట్టి సైకిల్‌కు మెజారిటీ స్థానాలు వచ్చేలా చూడాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే బాలయ్యని దెబ్బ కొట్టడానికి ఫ్యాన్ పార్టీ కూడా మంచి మంచి వ్యూహాలతో సిద్ధమవుతోంది. పైగా అధికార బలంతో హిందూపురంలో బాలయ్యకు చెక్ పెట్టాలని అనుకుంటున్నారు. ఎక్కువ పంచాయితీల్లో గెలిస్తే, బాలయ్య హవా కాస్త అయినా తగ్గించవచ్చని చూస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా బాలయ్యకు చెక్ పెట్టేస్తే,ఇక హిందూపురంలో వైసీపీకి తిరుగుండదని భావిస్తున్నారు. మరి చూడాలి బాలయ్య అడ్డాలో ఫ్యాన్ హవా ఏ మేరకు ఉంటుందో.