గవర్నర్ దగ్గరకు నాదెండ్ల...?

దేశ రాజధాని ఢిల్లీ లో‌జరిగిన ఘటనను ఖండిస్తున్నాం అని జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. రైతులకు మేలు జరిగేలా కేంద్రం తీసుకున్న నిర్ణయాలను కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి అని ఆయన ఆరోపించారు. రాష్ట్రం లో సిఎం రాజ్యాన్ని గౌరవించడం లేదు అని మండిపడ్డారు. కొంతమంది కే పరిమితం అయి నియంత పాలన సాగిస్తున్నా అని ఆరోపించారు. బిజెపి, జనసేన పొత్తుతో పంచాయతీ ఎన్నికలలో యువత ను‌ ప్రోత్సహిస్తున్నాం అని అన్నారు. యువత ఎక్కువ మంది స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగాలి అని ఆయన కోరారు.
రాష్ట్రం లో దాదాపుగా అన్ని స్థానాలలో పోటీ‌ చేయాలని ఇరు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయిఅన్నారు. ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను బెదిరించారు అని మండిపడ్డారు. గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నాం.. ప్రభుత్వం చర్యలు పై ఫిర్యాదు చేస్తాం అని స్పష్టం చేసారు. అన్ని‌ప్రాంతాలలో సామరస్యంగా, శాంతియుతంగా ఎన్నికలు జరగాలి అని కోరారు. కానీ‌ ప్రభుత్వం పోటీ లెకుండా ఏకపక్షంగా ఏకగ్రీవాలు చేయాలని చూస్తుంది అని మండిపడ్డారు. దీని పై మంత్రులు ప్రకటనలు చేసి, ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నాం అన్నారు.
ఇటువంటి ప్రచారం ద్వారా ప్రభుత్వం కుట్రలు చేస్తుందనే అనుమానం మాకుంది అని అన్నారు. ప్రజా స్వామ్య బద్దంగా ఎన్నికల ప్రక్రియ జరగాలని ఎన్నికల కమిషనర్ ను కోరుతున్నాం అని ఆయన తెలిపారు. గతంలో అనేక‌ చోట్ల నామినేషన్ ను‌ వేయకుండా అడ్డుకున్నారుఅని ఆయన మండిపడ్డారు. అందుకే ఆన్ లైన్ ద్వారా నామినేషన్ వేసే అవకాశం కల్పించాలి అని కోరారు. గతంలో జగన్మోహన్ రెడ్డి వల్ల ఐఏఎస్ లు జైళ్లకు‌ వెళ్లారు  అని అన్నారు. ఇప్పుడు కూడా జగన్ రెడ్డి పాలన అదే విధంగా సాగుతుంది అని ఆయన ఆరోపించారు. పంచాయతీ ల అభివృద్ధి కి కేంద్రం నేరుగా నిధులు విడుదల చేస్తుంది అని అన్నారు. బిజెపి, జనసేన క్యాడర్ మొత్తం కలిసి కట్టుగా పని చేస్తారు అని ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: