జగడ్డ : కంగారులో మనసులో మాట బయటపెట్టిన జగన్ మంత్రి.. రంగంలోకి బీజేపీ..?

praveen
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోంది. ఇక తమ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నాయి అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ జగన్ సర్కార్ ప్రవేశపెడుతున్న పథకాల లో దాదాపు సగానికిపైగా పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినవే అని  బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరు మార్చి అమలులోకి తెచ్చింది అనే విషయం తెలిసిందే.



 ఇక జగన్ సర్కార్ ఇలా కేంద్ర ప్రభుత్వ పథకాలు పేరుమార్చి కొత్త పేరుతో ఇక తామే పథకాన్ని ప్రవేశపెట్టాము  అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్న తరుణంలో బిజెపి మాత్రం అటు జగన్ సర్కారు తీరును ఎండగడుతూ.. జగన్ ప్రవేశపెడుతున్న పథకాలను అసలు సూత్రధారి, పాత్రధారి ఎవరు అనే విషయాన్ని ప్రజలకు తెలియ జేస్తూ ఉన్నారు. కాగా  జగన్ ప్రవేశపెట్టబోయే పథకం విషయంలో మరోసారి తొందరపాటులో మనసులో మాట బయటపెట్టారు.



 ఇంటింటికి నల్ల నీరు అందించాలని జగన్ సర్కారు నిర్ణయించింది అన్న విషయం తెలిసిందే. ఈ పథకం కోసం ఒక ప్రత్యేకమైన పేరు కూడా సిద్ధం చేసింది. ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ఈ పథకం వెనుక అసలు సూత్రధారి మాత్రం మోడీ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జల్ జీవన్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇక ప్రతీ రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్ల నీరు అందే విధంగా భారీగా నిధులు ఇస్తుంది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ పథకంలో భాగంగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది.  కానీ ఇటీవలే ఈ పథకం గురించి ప్రెస్ నోట్ విడుదల చేయడంలో  తొందరపడిన వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక జల్ జీవన్ మిషన్ అనే పేరు ప్రస్తావన రాకుండానే  ప్రెస్ నోట్ విడుదల చేయడం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇలా తొందరపాటులో తమ పథకమే అని మనసులో మాట బయట పెట్టారు అని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: