దొంగలు జైలుకు వెళ్తే మారతారు అనుకోవడం మన మూర్ఖత్వం అనే చెప్పాలి.. ఒకసారి దొరికాయి ఇంక మారాల్సిన అవసరం లేదు అంటూ చాలా మంది మళ్లీ అదే పని చేస్తున్నారు. విషయానికొస్తే.. కొందరు దొంగలు పదమూడు సార్లు జైలుకు వెళ్లారు. మారమని పోలీసులు ఎన్ని సార్లు చెప్పినా పెడ చెవిన పెట్టారు. అయితే ఇప్పుడు మరోసారి దొంగతనం చేసి పట్టుపడ్డారు..ఈసారి మాత్రం పోలీసులు ఝలక్ ఇచ్చారు.
వివరాల్లోకి వెళితే.. 13 సార్లు జైలుకు వెళ్లొచ్చినా ఆ
దొంగ బుద్ధి మారలేదు. ఎప్పటిలాగే చోరీలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. బైకులు, సెల్ఫోన్లు దొంగలిస్తున్న నిందితుడిని చౌటుప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని చౌటుప్పల్ ఏసీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను ఏసీపీ సత్తయ్య వెల్లడించారు. చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటంకు చెందిన కందగట్ల కిరణ్ బైక్‌లు, సెల్ఫోన్లు దొంగతనం చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ప్రధానంగా బస్టాండ్లు, ఇండ్ల ముందు, సర్వీస్‌రోడ్ల వెంట పార్కింగ్ చేసిన బైక్‌లను దొంగలించేవాడు.
ఇటీవల తన గ్రామానికి చెందిన చేవెల్లి మహేష్, చౌటుప్పల్ గ్రామానికి చెందిన బండారి సంతోష్‌కుమార్, పస్తం మల్లేశం తో కలిసి కిరణ్ టీమ్‌గా ఏర్పాడ్డాడు. చౌటుప్పల్‌తో పాటు ఏలూరు, మహబూబాబాద్, షాద్‌నగర్ పరిధిలో బైక్‌ల దొంగతనాలు చేస్తూ వస్తున్నాయి. ఈ మేరకు సంభందిత
పోలీస్ స్టేషన్ లలో
బైక్ మిస్సింగ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో నిఘా పెట్టిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు.సంస్థాన్‌నారాయణపురం మండల కేంద్రంలో బుధవారం పోలీసులు తనిఖీ చేస్తుండగా..బైక్‌పై వెళ్తున్న కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా తాను, తన టీమ్ సభ్యులు బైకులు దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడు. కిరణ్ తో పాటు అతని టీమ్ సభ్యులు మహేష్, సంతోష్‌కుమార్, మల్లేశాన్ని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే వారి పై పలు కేసులు కూడా ఉన్నట్లు గుర్తించారు. నిందితులను ఈరోజు రిమాండ్ కు పంపనున్నారు..