జగడ్డ: కోడెల కోటలో రెడ్డి గారి రేంజ్ పెరిగిందా?

M N Amaleswara rao
గుంటూరు జిల్లా నరసారావుపేట నియోజకవర్గం...దివంగత కోడెల శివప్రసాద్ అడ్డా. డాక్టర్ వృత్తి నుంచి ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన కోడెల..నరసారావుపేట అసెంబ్లీ బరిలో వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధింకారు. 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో కోడెల గెలిచారు. ఇక 2004, 2009 ఎన్నికల్లో ఓడిన కోడెల 2014 ఎన్నికల్లో నరసారావుపేట వదిలేసి, సత్తెనపల్లి వెళ్ళి అక్కడ విజయం సాధించారు. ఇక 2019లో ఓడిపోయాక అనూహ్య రీతిలో కోడెల ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన విషయం తెలిసిందే.

అయితే కోడెల చనిపోయినా సరే నరసారావుపేటతో ఆయనకు ఉన్న అనుభంధం చెరిపివేయలేనిది. ఇప్పటికీ అక్కడి ప్రజలు కోడెలని అభిమానిస్తూనే ఉంటారు. ఆయన చేసిన అభివృద్ధి ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. అయితే కోడెల ఇమేజ్‌ని టీడీపీ మాత్రం ఉపయోగించుకోలేకపోతుంది. గత రెండు పర్యాయాల నుంచి ఇక్కడ వైసీపీ హవా ఉంటుంది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజయం సాధిస్తున్నారు.

అటు టీడీపీ నుంచి పోటీ చేస్తున్న చదలవాడ అరవిందబాబు ఓటమి పాలవుతూ వచ్చారు. పైగా ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. దీంతో పేటలో వైసీపీ హవా తగ్గలేదు. ఇప్పుడు పంచాయితీ ఎన్నికల్లో వైసీపీనే మెజారిటీ స్థానాలు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు ఎమ్మెల్యే reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గోపిరెడ్డి కూడా మంచిపనితీరు కనబరుస్తున్నారు. కాకపోతే రాజధాని అంశం ఎమ్మెల్యేకు నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఒకవేళ ప్రజలు రాజధాని అంశం బట్టి చూస్తే టీడీపీ వైపే మొగ్గుచూపుతారు. లేదంటే పేటలో వైసీపీ డామినేషన్ గట్టిగానే ఉంటుంది. ఎమ్మెల్యే ఇప్పటికే పేటలో మెజారిటీ పంచాయితీలని కైవసం చేసుకోవాలనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈయనకు టీడీపీ నేత చదలవాడ పెద్దగా పోటీ ఇచ్చేలా లేరు. పైగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఎమ్మెల్యేకు ప్లస్ అవుతాయి. మొత్తానికి చూసుకుంటే కోడెల కోటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రేంజ్ పెరిగినట్లే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: