జగడ్డ : తొలి విడత నామినేషన్లు షురూ.. జగన్ లో మొదలైన టెన్షన్..?
ఇక అదే సమయంలో ప్రజలు మొత్తం తమ వైపే ఉన్నారని తమ పథకాలతో ప్రజలు అందరూ ఎంతగానో లబ్ధి పొందుతున్నారు అని అంటున్న అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో తమదే విజయం అంటూ ప్రస్తుతం ధీమాతో ఉంది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి.. ఇక ప్రజలందరిలో తమ పార్టీపై నమ్మకాన్ని కలిగించాలని బీజేపీ జనసేన పార్టీలు కూడా వ్యూహాత్మకంగానే ముందుకు కదులుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు విడతలుగా నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
అయితే నేటి నుంచి తొలి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు అధికారులు. దీంతో గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ క్రమంలోనే అటు అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు అందరూ కూడా నామినేషన్లు వేసేందుకు తరలివస్తున్నారు. అయితే తొలి విడత నామినేషన్ల ప్రక్రియ షురూ కావడంతో ప్రస్తుతం జగన్ లో భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నిక కావడం.. ఇక ఈ ఎన్నికలు జగన్ మూడేళ్ల పాలన కు లో నిలువుటద్దంగా మారబోతున్న నేపథ్యంలో.. ఫలితం ఎలా ఉండబోతుందో అని అటు జగన్ కాస్త టెన్షన్ పట్టుకున్నట్లు చెబుతున్నారు విశ్లేషకులు.