విషంతో అధ్యక్షుడికి లేఖ..చదివిన వెంటనే

దేశ అధ్యక్షుడిని హతమార్చదానికి ఓ ఆజ్ఞతవాసి స్కెచ్ వేసాడు. అధ్యక్షుడిని కలవడానికి మంత్రులకే అంత సులభం కాదు. కనీసం చూడటం కూడానా అంత సులువు కాదు. అపాయింట్మెంట్ తీసుకోవాలి. అధ్యక్షుడు కాళీగా ఉంటే అప్పుడు అపాయింట్ మెంట్ దొరికే అవకాశం ఉంది. కాబట్టి అధ్యక్షుడిని కలవకుండానే హతమార్చాలని నిర్ణయం తీసుకున్నాడు. మరి ఎక్కడ చూశాడో .. ఎక్కడ చదివాడో గాని చేతికి మట్టి అంటకుండా హతమార్చాలని డిసైడ్ అయ్యాడు. దాంతో వాసనకే చనిపోయే విషం తో రాసిన ఒక లేఖను అధ్యక్షుడికి పంపించారు. కాగా ఆ లేఖను ముందుగా అధ్యక్షుడి పీఏ చదవగా అస్వస్థతకు గురైంది. ఈ ఘటన టీనిషియా దేశంలో జరిగింది. దేశ అధ్యక్షుడు కైస్ సయీద్ ను చంపడానికి విషం తో రాసిన లేఖను దుండగులు పంపించారు. ఆ లేఖ అధ్యక్షుడి టేబుల్ పై ఉండగా పిఏఏ నదియా ఆకాచ తెరిచి చదివింది. అయితే లేఖ తెరవగానే విషం వాసన రావడం తో ఆమెకు కళ్ళు తిరిగాయి.  వెంటనే అస్వస్థతకు గురై నదియా కింద పడిపోయింది. సిబ్బంది నడియాను ఆస్పత్రికి తరలించగా..ప్రమాదకర విషంతో లేఖను రాసినట్టు వైద్యులు గుర్తించారు. ఆ విషం వాసనకే ప్రాణాలు పోయే ప్రమాదం వుందని అన్నారు. కాగా  తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని దేశ ప్రజలు కంగారు పడవద్దని దేశ అధ్యక్షుడు కైస్ సయీద్ ప్రకటన విడుదల చేసారు . ప్రస్తుతం తన పీఏ ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ లేఖపై దేశ ఆర్మీ కూడా ఇప్పటికే విచారణ ప్రారంభించింది. లేఖని తీవ్రవాదులు పంపించారా..లేదంటే ఇంకెవరైనా పంపించారా అన్నదానిపై విచారణ చేస్తున్నారు. నిండుతులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని ఆర్మీ ఇప్పటికే హెచ్చరించింది. అంతే కాకుండా అధ్యక్షుడికి ఇప్పటికే భారీ భద్రత ను కూడా ఏర్పాటు చేసారు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: