కేసీఆర్ ఆ పూజతో రాజకీయాల్లో మహా శక్తివంతుడు అవనున్నాడా...?
అందుకని ఆయన తరచూ పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అందులోనూ కొందరు ప్రత్యేక వ్యక్తులు... ఫలానా పూజ చేస్తే అంతా మంచి జరుగుతుంది అంటే చాలు ఇక వాటిని తప్పక ఆచరిస్తారు కేసిఆర్. అందులోనూ కేసిఆర్ చేసే పూజలు చాలా వినూత్నంగా ఉంటాయి. అందులో చాలా పూజా విధానాలు అసలు మన వాళ్ళు ఎవరికీ తెలియనివి కావడం విశేషం. ఆ మధ్యకాలంలో కేసిఆర్ తో స్వరూపానందేంద్ర సరస్వతి గారు చేయించినటువంటి పూజలు.. అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి.
ఈ పూజలు చేయమని సలహా ఇచ్చింది చినజీయర్ స్వామి గారు... అందుకనే ఆ చర్చలో వీరిద్దరి పేర్లు హైలెట్ గా నిలిచాయి. ఇలా పూజలు యాగాలు చేయడంలో కేసిఆర్ పెట్టింది పేరు. చండీ యాగాలు, హోమాలు ఇలా అనేక రకాల పూజలు ఎంతో నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో బగళాముఖి పూజ జరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది.. ఇందులో భిన్నమైనటువంటిది ఏమిటంటే.. ఇది మామూలు పూజ లాగా కాకుండా విభిన్నంగా ఉంటుంది. ఈ పూజ చాలా పవర్ఫుల్ అని కూడా చెబుతుంటారు... కాకపోతే నియమనిష్టలు కాస్త ఎక్కువగానే ఉంటాయి.
ఈ పూజలు ఎంత డిఫరెంట్ అంటే దాదాపు 99 శాతం మంది అర్చకులకు కూడా ఈ పూజా విధానం ఎలా చేయాలో తెలిసుండదు. ఇందులో కీలకమైనటువంటిది... పూజానంతరం పూజకు వినియోగించిన ద్రవ్యాలు.. అవశేషాలను తీసుకెళ్లి నది ప్రవాహంలో కలపాల్సి ఉంటుంది. అప్పుడే పూజ ఫలితం పూర్తిగా దక్కుతుందని ప్రతీతి. ఆ మధ్యన కేసిఆర్ సతీసమేతంగా కాళేశ్వరం వెళ్లింది కూడా పూజా ద్రవ్యాలు అవశేషాలను నదిలో కలపడానికే తప్ప అక్కడ ప్రాజెక్ట్ చూడడానికి కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జర్నలిస్ట్ సాయి.
అయితే ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి మరో పూజ పెద్ద చర్చకు తెరతీసింది. అది ఎందుకు ఆ వివరాలు ఏంటి..?? అంటే..నిన్న కాశీలో ఎమ్మెల్సీ కవిత గారు పూజ చేయడం అక్కడ కు కేసిఆర్ కుటుంబం లోని మహిళలు కూడా పాల్గొనడం... అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడు కూడా భగళాముఖి పూజ తరహాలో... ఈ పూజ కూడా చేశారు అని పేర్కొన్నారు సాయి. ఈ క్రమంలో కేసిఆర్ ఆయన సతీమణి వారి బిడ్డ మరియు వారి ప్రత్యేక బంధువులు అంతా కలసి... గంగా నదికి వెళ్లి అదే పూజలు చేశారన్నది చర్చ.