దారుణం : బెడ్ ఖాళీ లేదని.. పేషెంట్ ని చంపేసిన డాక్టర్..?
అయితే ఇలా ఆసుపత్రిలో బెడ్లు సరి పోనప్పుడు బాధితులు ఏదో ఒక విధంగా పేషెంట్లకు సదుపాయం ఏర్పాటు చేసి వైద్యం అందిస్తూ వుంటారు. లేదా వేరే ఆస్పత్రికి పంపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ ఒక వైద్యుడు చేసిన పని మాత్రం ప్రస్తుతం సంచలనం గా మారిపోయింది. ఇక్కడ ఒక వైద్యుడు పనిచేస్తున్న ఆస్పత్రికి ఒక కరోనా పేషెంట్ వచ్చాడు. ఈ క్రమంలోనే బెడ్లు ఖాళీ లేకపోవడంతో ఇక ఆ డాక్టర్ ఆ పేషెంట్ ను మరొక ఆస్పత్రికి పంపించకుండా ఏకంగా పైలోకాలకు పంపించాడు. బెడ్లు ఖాళీ లేవు అనే కారణంతో దారుణంగా హత్య చేశాడు. ఇటలీలో వెలుగులోకి వచ్చింది.
అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదు కరోనా పీక్ స్టేజిలో ఉండి ఎక్కువ కేసులు నమోదు అవుతున్న సమయంలో జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ ఆసుపత్రిలో కరోనా ఎమర్జెన్సీ వార్డుకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నాడు కార్లో మోస్కా . ఈ క్రమంలోనే కరోనా కేసులు పెరిగి ఇక పేషెంట్ల తో ఆసుపత్రులలో ఎమర్జెన్సీ వార్డులో ఉన్న బెడ్లు అన్నీ నిండిపోయాయి. ఈ క్రమంలోనే కొంతమందిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు డాక్టర్. ఈ క్రమంలోనే ఇద్దరు వృద్ధులను టార్గెట్గా చేసుకుని వారికి పలు రకాల మందులు ఇచ్చి చివరకు ప్రాణాలు కోల్పోయేలా చేశాడు సదరు డాక్టర్. అయితే ఆ తర్వాత ఈ విషయాన్ని సెల్ ఫోన్ లో చాటింగ్ చేయడం తో అసలు ఉదంతం వెలుగులోకి వచ్చి సంచలన గా మారిపోయింది.