ఆంధ్ర ప్రదేశ్ పంచాయితీ ఎన్నికల సెగ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లు వెలు వేత్తుతున్నాయి. అధికార
పార్టీ నేతలు ఏకగ్రీవాలకు ఆద్యం పోస్తుంటే.. మరో వైపు
టీడీపీ ఎన్నికలను జరపాలని చూస్తున్నారు. ఈ పోరులో ప్రజలు ఎవరి నిర్ణయానికి మద్దతు తెలుపుతారు అన్నది ఆసక్తిగా మారింది. ఈ విషయం పై ఎన్నికల కమీషన్ కూడా భీష్మించుకుని కూర్చుంది. ఎన్నడూ లేని విధంగా ఎన్నికల జరిగే జిల్లాల్లో పర్యటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇది ఇలా ఉండగా ఎక్కడైనా సరే ప్రభుత్వ వ్యవస్థలంటే.. ఏ స్థాయిలో ఉన్నవారైనా, ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోవాలన్నా అది ఎందుకోసమో తెలియచేస్తూ పారదర్శకత కోసం నోట్ ఫైల్స్‌తో కూడిన ఫైల్ ఉంటుంది.రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర
ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఎలాంటి నోట్ ఫైల్స్, ఫైల్స్ లేకుండానే వరుసగా అత్యంత వివాదాస్పద నిర్ణయాలను ఎడాపెడా తీసుకుంటున్నారు. ప్రవీణ్ ప్రకాష్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ శుక్రవారం తీసుకున్న నిర్ణయంతో సహా ఇటీవల నిమ్మగడ్డ పలు వివాదాస్పద నిర్ణయాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కనీసం ఎందుకు తీసుకున్నారో తెలియజేసే ఫైళ్లు కూడా లేవని స్పష్టమవుతుంది.
రాజకీయాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలన్న కూడా ముందు గా ఫైల్స్ లో పొందుపచబడతాయి.ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇదే విధానాలను అమలు చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు వివరించాయి. సాధారణంగా రాజకీయ పార్టీలు లేదా ఇతరులెవరైనా ఫిర్యాదులు చేయకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోదు. కానీ నిమ్మగడ్డ మాత్రం ప్రజాస్వామ్య పద్ధతులను విస్మరించి సొంత నిర్ణయాలు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తాజాగా కూడా నిమ్మగడ్డ ఆదేశాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కాకుండా బయటే రూపుదిద్దుకుని వస్తున్నాయని, వాటినే నిమ్మగడ్డ తన పేరుతో జారీ చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.నిమ్మగడ్డ ఇలాంటి సొంత నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఏదైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.