జగడ్డ: వైసీపీకి మరో షాక్.. వారి దూకుడుకు నిమ్మగడ్డ బ్రేక్...?
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా అడ్డు పడుతున్నట్లు పలు రాజకీయ పార్టీలు ఎస్ఈసీ కి మొర పెట్టుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలు ముగిసేవరకు గ్రామాల్లోకి ప్రభుత్వ వాహనాలకు అనుమతి లేదని ఖరారు చేశారు. దీనర్థం నాయకులు సైతం ఇక ప్రచారాలు జరపకూడదు అన్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు ఆయన ఈ వివరాలను తెలుపుతూ ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. కాగా ఈ లేఖలో కొన్ని ప్రముఖ అంశాలను పేర్కొన్నారు. అవేంటో చూద్దాం.
ఎన్నికల కోడ్ గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని, మంత్రులు గ్రామాలకు వెళ్లే సమయంలో వారి వెంట అధికారులు వెళ్లకూడదని తెలిపారు... అంతేకాదు ప్రభుత్వ వాహనాలు ఉపయోగించరాదని చెప్పారు. ఒకసారి నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత.. నాయకులు ఎన్నికల ప్రచారం చేయరాదని స్పష్టం చేశారు. ప్రచారం కోసం ప్రెస్ మీట్ లు కూడా కార్యాలయాల్లో జరపకూడదు అన్నారు.
ఇకపోతే అభ్యర్థులకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా ఆటంకాలు కలిగిస్తున్న విషయంపై పలు సంచలన నిర్ణయం తీసుకుంది ఎస్ఈసి.
ఒకవేళ అభ్యర్థులు ఎన్నికల్లో కొత్త కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేని ఎడల పాత కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిర్ణీత సమయం వారికి ఇవ్వాలని తెలిపారు. అంతేకాక ఎన్నికలు ప్రజలను ప్రభావితం చేసే విధంగా.. ప్రజాప్రతినిధుల పర్యటనలో ఉద్యోగులు పాల్గొనకూడదని సూచించారు. అయితే ఎస్ఈసి ఆదేశిస్తున్న ఈ కొత్త సూచనలపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధుల హక్కులకు భంగం కలిగిస్తున్నారు అంటూ వ్యాఖ్యలు వినబడుతున్నాయి.