జగడ్డ: చిత్తూరులో నామినేషన్ల లెక్కలు ఇవే?

Satvika
ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలయిన నాటి నుంచి నిన్న ముగిసే వరకు ఉత్కంఠగా సాగింది..నిన్నటి వరకు నామినేషన్లు వస్తాయా? లేదా ఏకగ్రీవం అనే సంగతి ఆసక్తికరంగా మారింది. పలు జిల్లాల్లో ఏకీగ్రీవం పై చర్చలు జరిగాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఈ అంశం పై కీలక చర్చలు జరిగాయి. ఇక ఏకగ్రీవ పంచాయతీలను ప్రోత్సహించే దిశలో ప్రభుత్వం ఈసారి మరింత భారీగా ప్రయోజనాలు కల్పించేందుకు సిద్ధమవుతోంది. తొలిదశ నామినేషన్ ముగిసింది. అయిన రాజకీయ నేతలు కూడా అదే దోరణి తో కొనసాగుతున్నారు.



ఏకగ్రీవాల ద్వారా పంచాయతీలకు ఎన్నికలు జరగడాన్ని ప్రోత్సహించాలనే మంచి ఉద్దేశం తో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. వైసీపీ వేసుకున్న పథకం ప్రకారం ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగాయి.. చిత్తూరు జిల్లాలో మొత్తం 19 నియోజక వర్గాల్లో ఏకగ్రీవాలు జరిగాయని తెలుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక స్థానాల్లో ఏకగ్రీవాలు చేసుకున్న జిల్లా చిత్తూరు నే అవ్వడం గమనార్హం.. ఆయన సొంత జిల్లాల్లో ఎక్కువగా ఏకిగ్రీవాలు జరిగాయి. కాగా , చిత్తూరు లో నామినేషన్ల పర్వం నిన్న ముగిసింది. గొడవలు, దాడులు మద్య నామినేషన్ ముగిసింది. ఇక విషయానికొస్తే.. జిల్లాలో తొలి దశ ఎన్నికల నామినేషన్ల ఘట్టం పూర్తి అయ్యింది. 



చిత్తూరు డివిజన్ పరిధిలోని 20 మండలాల్లోని పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 454 గ్రామ పంచాయతీలకు 2,890 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అత్యధికంగా బంగారుపాలెం మండలంలో 309 నామినేషన్లు దాఖలవగా... అత్యల్పంగా పాల సముద్రం మండలంలో 69 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు స్థానాలకు మొత్తం 6,821 నామినేషన్లు దాఖలయ్యాయి.. టీడీపీ నేతలకు ఈ నామినేషన్లు ఊరటనిస్తున్నాయి.. మరి ఫిబ్రవరి 9 న జరగనున్న పోలింగ్ లో ఎవరికీ విజయం సెక్యండ్ ఇస్తుందో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: