జగడ్డ:నిమ్మగడ్డ సారూ...ఆ గ్రామంలో 2006 తరువాత స్థానిక ఎన్నికలు జరగలేదు...కారణం ఏమిటో?
దానికి పూర్తి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తూ ఉండడం ప్రభుత్వానికి ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాం అనే ముసుగులో ఈ విధంగా కక్ష్య పూరితంగా వ్యవహరించడం జీర్ణించుకోలేని విషయం. ఇలా కాకుండా ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్థానిక ఎన్నికలకు సంబంధించి నిజమైన సమస్యలను పరిష్కరిస్తే బాగుంటుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే దాదాపుగా 3 లక్షల 60 వేల ఓట్లు తొలగించడం అనేది ప్రస్తుతం చాలా పెద్ద సమస్యగా పరిగణించవచ్చు.
ఎన్నికల సంఘం వారు ఈ సమస్య మీద వారి దృష్టిని సారించి పరిష్కరిస్తే బాగుంటుంది కదా? ఇప్పటికైనా సమయం మించిపోలేదు. మొత్తం మూడు దశలలో పంచాయితీ ఎన్నికలు జరగనుండగా, ఇంకా మొదటి దశ ఎన్నికలే ప్రారంభం కాలేదు కాబట్టి, ఇప్పటినుండి అటువంటి వారిని గుర్తించి వారిచేత అప్లై చేయిస్తే కనీసం అందరూ కాకపోయినా కొంతమంది అయినా వారి ఓటు హక్కును పొందగలుగుతారు. ఎలాగైతే ఎన్నికల నిర్వహణకు వివాదాలు జరగకుండా ఆపేందుకు ఎన్నికల సంఘం వారు యాప్ ను సృష్టించారో, అదే విధంగా ఓటు హక్కును రిజిస్టర్ చేసుకోవడానికి యాప్ పెడితే ఇంకా సులభంగా మరియు త్వరగా సమస్య తీరిపోతుంది.
వీటన్నింటికంటే అత్యంత ప్రధానమైన సమస్య శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి మండలం పట్టుపురం గ్రామ పంచాయితీలో మొత్తం 1225 మంది ఓటర్లు ఉన్నారు. అయితే 2006 తరువాత జరిగిన రెండు స్థానిక ఎన్నికలలో కూడా ఇక్కడ ఎన్నిక జరగకపోవడం ఆశ్చర్య పడే విషయం. కానీ వీరు అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం ఓటును వేస్తున్నారు. ఈ పంచాయితీ ఎస్టీలకు రిజర్వు కాబడినది, అయితే అక్కడ ఒక్క ఎస్టీ కూడా లేకపోవడంతో పోటీ చేసే అభ్యర్థి లేరు తద్వారా ఎన్నిక జరగడానికి అవకాశం లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అక్కడ ఎన్నికలు జరిగేలా చేయాలి. అక్కడ ఇంతకు ముందున్న రాజకీయ పార్టీలు అలాగే ఎన్నికల సంఘం ఈ గ్రామానికి న్యాయం జరిగేలా చూడాలని ప్రముఖ జర్నలిస్ట్ సాయి అభిప్రాయపడ్డారు.