కాంగ్రెస్ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?
అయితే ఈ బడ్జెట్‌లో ఎక్కువగా ఎన్నికల జరిగే రాష్ట్రాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. ఐదు ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.5 వేల కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అసోం, కేరళ, బంగాల్‌లో జాతీయ రహదారుల అభివృద్ధికి నిర్ణయించారు. ఒక్క కేరళలోనే 65 వేల కోట్లు కేటాయించారు. బంగాల్‌లో 675 కి.మీ. మేర జాతీయ రహదారుల అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రహదారుల అభివృద్ధికి బంగాల్‌కు రూ.25 వేల కోట్లు కేటాయించారు.
అందుకే తెలంగాణ కాంగ్రెస్ నేతలు బడ్జెట్‌పై విరుచుకు పడుతున్నారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందంటున్నారు. ఇంత అన్యాయం జరుగుతుంటే.. బీజేపీ నుంచి గెలిచిన తెలంగాణ ఎంపీలు ఏం చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ..తెరాస ఎంపీలు ఏం చేస్తున్నారు.. తెలంగాణ ఎంపీలు నిద్ర పోతున్నారా..?గాడిదలు కాస్తున్నారా..? అంటూ మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.
కేంద్ర బడ్జెట్ నిరాశకు గురి చేసిందన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. కార్పొరేట్ శక్తుల కోసమే మోడీ ప్రభుత్వం ఉందని ఈ బడ్జెట్ నిరూపించిందన్నారు. పేదలు...మధ్యతరగతి..ప్రజలు ఆర్థిక సంపద పెంచే రంగాల గురించి బడ్జెట్ లో ఏం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. బ్యాంక్ లను జాతీయం చేసిన చరిత్ర కాంగ్రెస్ ది అయితే.. అదే బ్యాంకులను ప్రయివేటు పరం చేసింది బీజేపీ అంటూ విమర్శించారు. ఈ బడ్జెట్ ద్వారా ఇన్సూరెన్స్ రంగం అంతా విదేశీ చేతుల్లోకి వెళ్ళిందని మండిపడ్డారు.