పాకిస్తాన్ కి 5 లక్షల డోసుల వ్యాక్సిన్.. ఎవరిచ్చారో తెలుసా..?

praveen
చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు అతలాకుతలం అయిపోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అన్న విషయం తెలిసిందే.  ప్రపంచ దేశాలలో విజృంభించిన మహమ్మారి కరోనా  ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది.  అయితే కరోనా వైరస్ ప్రభావంతో అల్లాడిపోయిన దేశాల్లో చైనా మిత్ర దేశాలు కూడా ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  చైనాకు మిత్ర దేశమైన పాకిస్తాన్లో కూడా కరోనా వైరస్ తీవ్రంగా విజృంభించడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవాల్సి పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే సమయంలో అక్కడ కనీసం కరోనా వైరస్ ను కంట్రోల్ చేసేందుకు సరైన మౌలిక వసతులు కూడా లేకపోవడంతో ప్రభుత్వం అయోమయంలో పడిపోయింది అనే విషయం తెలిసిందే.



 ఇక వివిధ దేశాలు సహాయం అందించడంతో కరోనా వైరస్ ను  కాస్త నియంత్రించగలిగింది పాకిస్తాన్. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అయోమయంలో పడిపోయింది అనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ కనీసం ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్ కొనుక్కోలేని స్థితిలో ఉంది.  అదే సమయంలో ప్రపంచ దేశాలలో ఉగ్రవాదులతో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించే పాకిస్తాన్ కు వ్యాక్సిన్లు బహుమతిగా అందించేందుకు కూడా ఏ దేశం ముందుకు రావడం లేదు. ఈ క్రమంలోనే తన మిత్ర దేశమైన చైనా ముందుకు వచ్చింది.



 ఇటీవలే పాకిస్తాన్ కు చైనా ఆపన్నహస్తం అందించింది. చైనా నుంచి 5 లక్షల డోసుల వ్యాక్సిన్ పాకిస్తాన్కు అందించింది. ఈ మేరకు సినోఫార్మ్ వాక్సిన్ను చైనా నుంచి తమ దేశం స్వీకరించినట్లు పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు. అదే సమయంలో తమ దేశం నుంచి వ్యాక్సిన్  పొందిన మొదటి దేశంగా పాక్  నిలిచింది అని..  ఇది తమ మధ్య ఉన్న నిజమైన మైత్రికి నిదర్శనంగా భావిస్తున్నట్లు చైనా చెప్పుకొచ్చింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ చేసిన వ్యాక్సిన్  ద్వారా ఎన్నో సైడ్ ఎఫెక్టులు వస్తున్నాయని మిగతా దేశాలు చైనా వ్యాక్సిన్ ను నిషేధించాయి. మరి ఇప్పుడు పాకిస్తాన్ లో ఎలాంటి పరిస్థితులు తలెత్తబోతున్నాయి అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: