జగన్ టార్గెట్ చేసినా డోన్ట్‌కేర్ అంటోన్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ?
ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరో కాదు ప్రకాశం జిల్లాకు చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, కొండపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి. ఈ ముగ్గురిపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వీరు పార్టీని వీడడం లేదు. ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు గ్రానైట్ ఫ్యాక్టరీలపై ఎన్నో సార్లు దాడులు జగడంతో ఆయన చివరకు పార్టీ మారిపోయారు. కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుతో పాటు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గ్రానైట్ వ్యాపారాలపై కంటిన్యూగా దాడులు జరుగుతున్నాయి.
అసలు గొట్టిపాటి రవిని వదలకుండా టార్గెట్ చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల వేళ రవిని ఆర్థికంగా దెబ్బ తీసే ప్లాన్ జరుగుతోంది. ఇక పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వ్యాపారాలు ఏపీలో ఎప్పుడో ఆగిపోయాయి. అయినా ఆయన బాపట్ల పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఏడు నియోజకవర్గాల్లో పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. ఇక కొండపి ఎమ్మెల్యే స్వామిని ఎంత ఇబ్బంది పెడుతున్నా ఆయన కూడా పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడుతున్నారు.
అద్దంకిలో 103, పర్చూరులో 95, కొండపిలో 111 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీలను ఏకగ్రీవం చేయాలని అధికారపార్టీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వీరు మాత్రం టీడీపీ నుంచి అభ్యర్థులను నిలబెట్టడంతో పాటు తమ నియోజకవర్గాల్లో పై చేయి కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనా ఈ ముగ్గురి పోరాటం మిగిలిన టీడీపీ నేతల్లో ఉంటే ఏపీలో టీడీపీ పరిస్థితి మరోలా ఉండేది.