ఈ ఆహారం ఎక్కువగా తింటే.. పురుషత్వం మటాష్.. పరిశోధనలో బయటపడ్డ నిజాలు..?
అయితే పురుషులు కొన్ని రకాల ఆహారాలతో అప్రమత్తంగా ఉండాలి అని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సోయాను ఇష్టపడుతూ అతిగా తినే పురుషులను హెచ్చరిస్తున్నారు. సాధారణం కంటే అధిక సోయాను ఆహారంగా తీసుకుంటే పురుష సామర్థ్యం క్రమక్రమంగా సన్నగిల్లుతుందని అధ్యయనంలో వెల్లడి అయ్యిందట. అంతేకాదు పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గిపోతుందట. ఇటీవలే శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ అధ్యయనంలో ఆసక్తికర నిజాలు బయట పడినట్లు తెలుస్తోంది. స్పెయిన్ లోని వేలెన్షియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఫ్రాన్సిస్కో దామింగ్యూన్ ఆధ్వర్యంలో.. 25 మంది పురుషులపై రెండేళ్ల పాటు అధ్యయనం జరిపారు.
ఈ క్రమంలోనే సోయా లోని పై పొరల్లో ఉండే రసాయనం పురుషుల పై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలి ప్రయత్నించారు శాస్త్రవేత్తలు. సోయా లో గర్భిణీ స్త్రీల హార్మోన్ల నుంచి పాలు ఉత్పత్తి చేసే ఫైటో ఈస్ట్రోజెన్ అనే ఎంజైమ్ ఉంటుందని.. ఈ పరిశోధనలో వెల్లడయింది. ఇది పురుషుల్లోని శుక్రకణాలను దెబ్బతీస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక ఈ ఎంజైమ్ వల్ల పురుషుల్లో వీర్యం ఉత్పత్తి వేగం కూడా తగ్గుతుందట. అందుకే పురుషత్వ సామర్థ్యాన్ని క్రమ క్రమంగా కోల్పోతూ ఉంటారట పురుషులు. అందుకే పురుషులు సోయా కు సంబంధించిన అన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండడం ఎంతో మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.