మాట నిలబెట్టుకున్న కేటీఆర్.. త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు..?

praveen
అప్పట్లో భాగ్యనగరంలో డబుల్ డెక్కర్ బస్సులు  తిరిగేవి అన్న విషయం తెలిసిందే.  ఎంతో మంది ప్రయాణికులు డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణించే వారు కానీ నేటి రోజుల్లో జనాలకు మాత్రం డబుల్ డెక్కర్ బస్సు లు కేవలం ఒక తీపి గుర్తుగా మాత్రమే మిగిలిపోయాయి. నేటి రోజుల్లో యువత ఎంతో మంది డబుల్ డెక్కర్ బస్సు ప్రయాణించడం కాదు కదా కనీసం చూడలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఈ క్రమంలోనే మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు నడిపితే బాగుండు అని ఎంతో మంది ప్రయాణికులు కూడా భావిస్తున్నారు. అయితే డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభించాలి అని గతంలో సోషల్ మీడియా వేదికగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..  తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను కొంత మంది కోరడంతో ఒకవేళ కుదిరితే మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు స్టార్ట్ చేసేందుకు తాను కృషి చేస్తాను అంటూ హామీ ఇచ్చారు కేటీఆర్.



 ఈ క్రమంలోనే ఆర్టీసీ అధికారులతో  కేటీఆర్ చర్చలు కూడా జరిపిన విషయం తెలిసిందే అయితే.  ఇక కేటిఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని  డబుల్ డెక్కర్ బస్సులలో ప్రయాణించాలి అనుకున్న హైదరాబాద్ నగరవాసులకు కోరిక తీర్చేందుకు  సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో భాగ్యనగరంలో డబుల్ డెక్కర్ బస్సు లు తిరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాదాపు 25 డబుల్ డెక్కర్ బస్సు తయారు చేసేందుకు తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది.  ఈ క్రమంలోనే నగరవాసులకు త్వరలో డబుల్ డెక్కర్ బస్సు లు కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది.


 మరో రెండు నెలల్లో డబుల్ డెక్కర్ బస్సు లను నగరవాసులు అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రస్తుతం ఆర్టీసీ అధికారులు అందరూ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా మూడు డబుల్ డెక్కర్ బస్సులను నగరంలో నడిపేందుకు తెలంగాణ ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సు ల తయారీ కోసం ఇప్పటికే పలు కంపెనీలకు టెండర్ల కోసం ఆహ్వానించింది. అయితే అచ్చం పాత డబుల్ డెక్కర్ బస్సు లాగానే కొత్త డబుల్ డెక్కర్ బస్సు లు తయారు చేస్తారా లేక కొత్తగా మార్పులు చేర్పులు చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.  ఏదేమైనా ప్రస్తుతం హైదరాబాద్ నగర వాసుల కల నెరవేరబోతోంది అన్నది మాత్రం అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: