ఏలూరి హవా మామూలుగా లేదుగా...ఇలా సెట్ చేశారా?

M N Amaleswara rao
ప్ర‌కాశం జిల్లా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని గ్రామాల్లో టీడీపీ స‌త్తా చాట‌నుందా ? ఇక్కడ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న టీడీపీ నాయ‌కుడు, యువ ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావు.. దూకుడు పెంచుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌రుస ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డంతోపాటు.. గ్రామీణ ప్రాంతాల‌కు ఆయ‌న అభివృద్ధి ఫ‌లాల‌ను అందిస్తున్నారు. గ‌త 2014లో విజ‌యం సాధించిన ఏలూరి.. టీడీపీ అధికారంలో ఉన్న నేప‌థ్యంలో రైతులు ప్ర‌ధానంగా డిమాండ్ చేస్తున్న సాగునీటికి ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఏళ్ల త‌ర‌బ‌డి వెనుక‌బ‌డిన ప్రాజెక్టులు ప్రాణం పోసుకున్నాయి.

ఇక‌, రైతుల‌కు అవ‌స‌ర‌మైన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చేందుకు ప్ర‌త్యేకంగా త‌న కార్యాల‌యంలోనే స‌ల‌హా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్ర‌భుత్వంతో చ‌ర్చించి.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పాటుప‌డ్డారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లోనూ ఏలూరి సాంబ‌శివ‌రావు విజ‌యం సాధించారు. అయితే.. ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు. అయినా.. కూడా ఎన్నారైల నుంచి నిధులు సేక‌రించి.. మ‌రీ .. రైతుల అభ్యున్న‌తికి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఎక్కువ భాగం ఆయ‌న గ్రామీణ ప్రాంతాల్లోనే ప‌ర్య‌ట‌న‌లు పెట్టుకుని రైతులు, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు. ఫ‌లితంగా ఏలూరి సాంబ‌శివ‌రావు పేరు జోరుగా వినిపిస్తోంది.

ఇక‌, ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఏలూరి హ‌వా ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ప్ర‌జానాయ‌కుడిగా.. గ్రామాల‌పై శ్ర‌ద్ధ పెట్టిన యువ నేత‌గా, ముఖ్యంగా రైతుల‌కు అన్ని విధాలా సాయం చేస్తున్న ప్ర‌జాప్ర‌తినిధిగా కూడా ఏలూరి సాంబ‌శివ‌రావు ముద్ర‌వేసుకున్నారు. దీంతో ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలోని చాలా గ్రామ పంచాయ‌తీలూ టీడీపీకి అనుకూలంగా ఉన్నాయ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. పైగా వైసీపీ కొన్నిచోట్ల పంచాయితీలని టీడీపీ అభ్యర్ధులని తప్పించి ఎక్కువ ఏకగ్రీవాలు చేసుకోవాలని చూశారు. కానీ ఎమ్మెల్యే  ఏలూరి వైసీపీకి చెక్ పెట్టేసి, టీడీపీ అభ్యర్ధులని పోటీలో ఉంచారు. మొత్తానికైతే పరుచూరులో మెజారిటీ గ్రామాలు టీడీపీ కైవ‌సం చేసుకోవ‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: