టీచర్ల వెతలు: భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే భయమేస్తోంది...?
ఎంతో కష్టపడి పెద్ద పెద్ద చదువులను అభ్యసించి మంచి పేరున్న స్కూల్ లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఎంతోమంది, ఇలాంటి ఒక రోజు వస్తుందని ఊహించి ఉండకపోవచ్చు. అంతే కాకుండా జీవితంలో ఇలాగా ఏ పనీ పాటా లేకుండా ఉంటారని అనుకోని ఉండరు. చాలామంది చెప్పుకోవడానికి కూడా వీలు లేని పనులను చేస్తూ ఉండడం హృదయ విచారకరం. ప్రతి ఒక్కరికీ వారి కుటుంబాలు ఉంటాయి. వీరే కాకుండావారిని కూడా పోషించుకోవాలి కాబట్టి దొరికిన పనిని వద్దనకుండా చేసుకుంటున్నారు. అర్ధంతరంగా వచ్చిన కరోనా మహమ్మారి అందరి జీవితాలను చిన్నాభిన్నం చేసేసింది.
ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఒక నెలకు 15 వేల నుండి 20 వేల వరకు సంపాదిస్తూ ఉండేవారు. కానీ ప్రస్తుతం వీరు చేసే రోజు వారీ పని వలన నెలకు 9 నుండి పది వేలు వస్తుంటాయి. పట్టణాల్లో జీవించే వారికి ఇది ఎంతవరకు సరిపోతుందో మనకు తెలియంది కాదు. ఇంకా దుర్భరమైన విషయమేమిటంటే ఉపాధ్యాయ వృత్తిని నమ్ముకుని పట్టణాల్లో స్థిరపడినవారు, ఇక్క ఉపాధి లేకపోవడంతో తమ స్వంత గ్రామాలకు తరలి పోయారు. అక్కడ జరిగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం క్రింద కార్మికులుగా పనికి వెళ్తున్నారు. ఇలా ఎక్కడ చూసినా ఉపాధ్యాయులకు ఇక్కట్లే.
ప్రస్తుతమున్న ఆర్థిక సంక్షోభం ఎందరో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ను మనుగడ కోసం ఏదైనా పనిని చేపట్టవలసి వచ్చింది. నేను నా అర్హత గురించి ఆలోచించడం మొదలుపెడితే, నేను ఆకలితో చనిపోతాను" చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వారంతా తరువాత భవిష్యత్తు గురించి ఆలోచించాలంటేనే భయపడుతున్నారు. దీంతో ఇకనైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని..కరోనా కరోనా కరణంగా ఎంతో మంది కొలువులు కోల్పోయి ఉన్న ఉపాద్యాయులకు కొత్త నోటిటికేషన్స్ విడుదల చేసే తమను ఆదుకోవాలని అర్ధిస్తున్నారు ఉపాద్యాయులు.