హైకోర్టులో అఖిల ప్రియ భర్త వాదన చూస్తే.. అంతా షాక్ అవ్వాల్సిందే..?
దీంతో ఇక చివరి ప్రయత్నంగా భార్గవ్ రామ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కోర్టులో ఆయన తరపు న్యాయవాది వినిపిస్తున్న వాదన చూసి అంతా షాకయ్యారు. అసలు ఈ కిడ్నాప్ కేసుతో తనకు ఏమాత్రం సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాది వాదించారట. అధికార పార్టీ అండతో ఏవీ సుబ్బారెడ్డి తనపై తప్పుడు కేసులు పెట్టించారని భార్గవ్ రామ్ తరపు న్యాయవాది వాదించాడట. మొదట ఈ కేసులో సుబ్బారెడ్డిని ఏ వన్ గా సుబ్బారెడ్డిని ఉంచారని.. ఆ తర్వాత .. అతన్ని ఏ టూ గా మార్చారని భార్గవ్ రామ్ తరపు న్యాయవాది చెప్పారట.
తనకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేనందువల్ల తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును కోరాడట. మరోవైపు భార్గవ్ రామ్, జగద్విఖ్యాత్ రెడ్డి బెయిల్ వస్తే తప్ప అజ్ఞాతం వీడే ఆలోచనలో ఉన్నట్టు కనిపించడంలేదు. వారిద్దరి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఈ కేసులో అఖిల ప్రియ తమ్ముడు జగద్విఖ్యాత్ రెడ్డి కూడా చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఇక అఖిల ప్రియ విషయానికి వస్తే.. ఆమె ఇటీవల విడుదలైనా.. భర్త, తమ్ముడు ఇద్దరూ అజ్ఞాతంలో ఉండటంతో ఆమెకూ ఇబ్బందికరంగానే ఉంది.
మరోవైపు అఖిల ప్రియ నుంచి ఈ కేసు గురించి మరింత సమాచారం లాగే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఆమె ప్రతి 15 రోజులకు ఒకసారి ఆమె పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం పెట్టాలన్న నిబంధన విధించింది కోర్టు.. ఆ షరతు ప్రకారమే.. అఖిలప్రియ మొన్న బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఆ సమయంలోనూ అఖిల ప్రియను భర్త భార్గవ్ రామ్ గురించి ప్రశ్నించినట్టు తెలుస్తోంది.