జగన్‌ కు పీఠాధిపతులు వార్నింగ్‌.. ఇది ఆంధ్రజ్యోతి ఆర్కే పులిహోరేనా..?

Chakravarthi Kalyan
ఆంధ్రజ్యోతి పత్రిక యజమాని రాధాకృష్ణకూ.. ఏపీ సీఎం జగన్‌కూ ఉన్న వైరం సంగతి తెలిసిందే. జగన్ అంటే చాలు ఆర్కే ఓ రేంజ్‌లో విరుచుకుపడుతుంటారు. అప్పుడప్పుడూ ఏ జర్నలిస్టు కూడా  చేయలేని సాహసాలు చేస్తుంటాడు. ఈ మధ్యనే.. ఆంధ్రజ్యోతి పత్రిక అదిరిపోయే కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. జగన్‌ ప్రభుత్వం రాజన్న రాజ్యం దిశగా అడుగులు వేయడంలేదని, తనను నిర్లక్ష్యం చేయడమే కాకుండా రాజశేఖర్‌ రెడ్డితో సన్నిహితంగా మెలిగిన వారిని కూడా పక్కనపెడుతూ వచ్చారని తన సన్నిహితుల వద్ద షర్మిల ఆవేదన వ్యక్తం చేశారని మొదట ఆర్కే రాసుకొచ్చాడు.

ఇంకేముంది.. షర్మిల, తెలంగాణలో సొంత రాజకీయ పార్టీని ప్రారంభించాలని దాదాపుగా నిర్ణయించుకుందని రాసేశాడు.. కానీ ఆ తర్వాత షర్మిల ఈ వార్తను ఖండించారు. ఆ సంగతి అలా ఉంచితే.. ఇప్పుడు మరో షాకింగ్ అంశం పట్టాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. అదేంటంటే.. జగన్ కు వ్యతిరేకంగా  అనేక మంది పీఠాధిపతులు కీలక సమావేశం  నిర్వహించాట. ఇది ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిందంటున్నాడు  ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఏపీ, తమిళనాడు సరిహద్దులోని ఓ గ్రామంలో పీఠాధిపతులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారట.

ఈ పీఠాధిపతుల సమావేశానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ పెద్దలు కూడా హాజరయ్యారట.  తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ కన్ను పడకుండా ఉండేందుకు రహస్య ప్రదేశంలో ఈ సమావేశం నిర్వహించారట. ఏపీలో ఆలయాలపై దాడులు, బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా వీరు సమావేశయ్యారంటున్నాడు  ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఈ సమావేశానికి దేశంలోని ముఖ్య పీఠాధిపతులు హాజరయ్యారట.

అసలే..  ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంతో పాటు మతమార్పిడులను జగన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆగ్రహంతో ఉన్న సంఘ్ పరివార్.. ఈ భేటీ ద్వారా జగన్‌కు  హెచ్చరిక పంపిందట. అయితే ఈ  భేటీ సమాచారం తెలిసి పీఠాధిపతులతో మాట్లాడేందుకు ప్రభుత్వంలోని ముఖ్య నేత విఫలయత్నం చేశారని ఆంధ్రజ్యోతి రాసింది. అంటే బహుశా జగనే కావచ్చు. ముఖ్య నేత సూచనతో ఓ మంత్రి రంగంలోకి దిగారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయని రాసింది ఆంధ్రజ్యోతి. మరి ఇందులో నిజమెంతో ఆర్కేకే తెలియాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: