బంగారపు ఇల్లును ఎప్పుడైనా చూసారా..ఇదిగో ఇలా ఉంటుంది..
కుర్చీలు, బెంచీలు, సోఫాలు అన్నీ ధగధగా మెరిసిపోతుంటాయి. షాండియర్ లైట్ల వెలుగులో మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. 6,997 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ భవంతి రష్యాలోని ఈర్కుత్స్క్ నగరంలో ఉంది.రెండెకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనం ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ భవంతిలో ఐదు బెడ్రూములు, డ్రెస్సింగ్ రూమ్లు, విశాలమైన హాలు, ప్రైవేట్ బాత్రూమ్లు, కారిడార్, పేద్ద వంటగది, డైనింగ్ హాల్ ఇలా అన్నింటిలో బంగారు తాపడంతో చేసిన వస్తువులు అమర్చి ఉంటాయి.
ఎటు చూసినా బంగారపు కాంతులు..ప్రఖ్యాత బైకాల్ సరస్సుకు సమీపంలో ఉండడం ఈ భవంతికి అదనపు ఆకర్షణ. ఈ భవంతికి విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యేక విద్యుత్ సబ్ స్టేషన్, వైన్ సెల్లార్, ఒక చేపల చెరువు, ఒక కృత్రిమ జలపాతం కూడా ఉన్నాయి. ఈ ఇల్లు ధర సుమారుగా 21 కోట్ల పై మాటే.. అయితే ఈ ఇంట్లో ప్రతిది కూడా పసిడితో తయారు చేయడం ప్రత్యేకత. బంగారం మాములుగా లోపలి ఉష్ణోగ్రతలను బయటకు వెళ్లనివ్వదు. ముఖ్యంగా చెప్పాలంటే చలి.. ప్రస్తుతం చలికాలం కావున ఆ ఇంటి యజమాని తట్టుకోలేక అమ్మేయాలని భావిస్తున్నారట..అంత పెద్ద ఏనుగు చిన్న దోమ వల్ల చచ్చింది అన్నట్లు..అంతగా ఏరి కోరి కట్టించుకున్న ఇంటిని చలికి తట్టుకోలేక అమ్మేస్తున్నారు..