అదిరిపోయే ఆఫర్.. 12 వేలు చెల్లించి కార్ ఇంటికి తీసుకెళ్లండి..?

praveen
దేశీయ దిగ్గజం కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ ఎప్పటికప్పుడు తమ కస్టమర్లను ఆకర్షించేందుకు అద్భుతమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకు వస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. తక్కువ ధరకే ఎంతో స్టైలిష్ కార్  లను అందిస్తు వినియోగదారులందరికీ కూడా కారు కొనుగోలు చేయాలనే కల నెరవేరేలా చేస్తుంది మారుతి సుజుకి. ప్రస్తుతం మార్కెట్లో మారుతి సుజుకి తయారు చేస్తున్న కార్లకు ఎంతో డిమాండ్ ఉంది అన్న విషయం తెలిసిందే.  ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్న దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ వినియోగదారులందరికీ సరికొత్త సర్వీస్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

 ఇటీవలే ఏ ఎల్ డి ఆటోమోటివ్ ఇండియా కంపెనీ తో జతకట్టిన మారుతి సుజుకి ఇందులో భాగంగా సబ్స్క్రిప్షన్ సర్వీసులను మరింత విస్తరించి తమ కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరే విధంగా సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇక ఇటీవలే తమ కారు సర్వీసులను కొచ్చి లో  కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఇక మరో ఎనిమిది పట్టణాల్లో కూడా ఈ సేవలు అందిస్తుంది మారుతి సుజుకి. ఇప్పటికే హైదరాబాద్ లో కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది అన్న విషయం తెలిసిందే.

 ఇక ఈ సబ్స్క్రిప్షన్ సర్వీసుల్లో భాగంగా కస్టమర్లు  వేగనార్, స్విఫ్ట్, డిజైర్, వితారా బ్రెజా, ఎర్టిగా వంటి మోడళ్లను ఎరీనా షోరూమ్స్ నుంచి రెంట్‌కు తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. అలాగే ఇగ్నిస్, బాలెనో, సియాజ్, ఎక్స్‌ఎల్6, ఎస్ క్రాస్ వంటి మోడళ్లను నెక్సా మోడళ్లు  కూడా అద్దెకు తీసుకెళ్లొచ్చు. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్ల కాల పరిమితితో కార్లను ఇంటికి తీసుకెళ్లొచ్చు. దీని కోసం కస్టమర్లు నెలకు రూ.12,513 నుంచి చెల్లించాల్సి ఉంటుంది. అంతే కారు సర్వీసింగ్, మెయింటెన్స్, ఇన్సూరెన్స్, రోడ్‌సైడ్ అసిస్ట్ సహా అన్ని అంశాలను కంపెనీయే చూసుకుంటుంది. అయితే టెన్యూర్ అయిపోయిన తర్వాత మీరు కారును మళ్లీ వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: