జగడ్డ: రంగు పడాల్సిందే.. జగన్‌కు మరోషాక్‌ ఇచ్చిన నిమ్మగడ్డ?

Chakravarthi Kalyan
ఏపీలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, సీఎం జగన్ మధ్య వైరం ఏ రేంజ్‌లో ఉందో తెలిసిందే. అందివ‌చ్చిన ఏ అవకాశాన్ని ఏ వర్గమూ వదిలిపెట్టడం లేదు. తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్‌ పంపిణీ వాహనాల ప్రారంభం విషయంలోనూ అదే జరిగింది. ఇంటింటికీ బియ్యం పంపిణీ వాహనాల రంగులు మార్చాలని ప్రభుత్వానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వాహనాల రంగులు వైకాపా పోలిన రంగులు వాహనాలపై ఉన్నాయని ఎస్‌ఈసీ అభిప్రాయపడ్డారు.

అందుకే.. పార్టీలకు  సంబంధం లేని రంగులు వేసి తీసుకురావాలని అధికారులుకు ఎస్ ఈ సీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ సూచించారు. అంతవరకూ గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ పంపిణీకి ప్రస్తుత వాహనాల వినియోగం నిలిపివేయాలని ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. రంగులు మార్చాకే  వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పథకం అమలుకు అనుమతిస్తామని నిమ్మగడ్డ రమేశ్ కుమార్  స్పష్టం చేశారు.

రెండు రోజుల క్రితం ఈ వాహనాలను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిశీలించారు. పౌరసరఫరాల శాఖ రేషన్ డెలివరీ వాహనాలను నిమ్మగడ్డ తనిఖీ చేశారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆఫీసుకు, రేషన్ డెలివరీ వాహనాలను  పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకువచ్చారు. పంపిణీ ఏ విధంగా జరుగుతుందో ఎస్‌ఈసీకి పౌరసరఫరాల‌శాఖ కమిషనర్ కోన శశిధర్ వివరించారు. అనంతరం ఎస్‌ఈసీ వాహనాలను పరిశీలించారు. అంతేకాదు ఆయన వాహనం ఎక్కి, డ్రైవర్ సీటులో కూర్చున్నారు.

వాహనంపై ఉన్న జగన్‌ చిత్రాన్ని పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వం నవరత్నాలు పేరుతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. నవరత్నాలకు సంబంధించిన లోగోను వాహనంపై ప్రత్యేకంగా ముద్రించారు.  రేషన్‌ డోర్‌ డెలివరీపై అంతిమ నిర్ణయం రాష్ట్ర ఎన్నికల సంఘానిదేనని హైకోర్టు తేల్చిచెప్పింది. ఎన్నికల ప్రక్రియలో ఎస్‌ఈసీయే రథసారథి అని స్పష్టం చేసింది. ఈ మేరకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. వాహనాల రంగులు మార్చాల్సిందే అని ఆదేశాలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: