ఇదోరకం దొంగతనం.. హైదరాబాదులో ఊహించని రీతిలో చోరీ..?

praveen
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా దొంగల బెడద అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది అనే విషయం తెలిసిందే. దీంతో ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అయితే దొంగలు మరింత రెచ్చిపోయి ఎన్నో ఇళ్లలో  దొంగతనాలకు పాల్పడుతూ అందినకాడికి దోచుకో పోతున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న మహిళలను, తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు.  అయితే దొంగలు ఎంతో ప్లాన్ ప్రకారం దొంగతనం చేసినప్పటికీ చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలు అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల హైదరాబాద్లో  కూడా ఇలాంటి తరహా ఘటన చోటు చేసుకుంది.



 ఓ వ్యక్తి ఇంటి అద్దె కోసం వచ్చాడు. ఈ క్రమంలోనే ఒంటరిగా ఉన్న ఉమాదేవి అనే మహిళపై దాడి చేసి ఇక ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు.  ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమి నగర్ లో చోటుచేసుకుంది.  ఇల్లు ఏమైనా అద్దెకు ఉన్నాయా అని ఉదయం వచ్చి అడిగిన ఓ వ్యక్తి ఇక మధ్యాహ్నం వచ్చి  దాడి చేసి మరీ దొంగతనానికి పాల్పడ్డారు.  కత్తితో మహిళపై దాడి చేయడంతో మహిళా తీవ్ర గాయాలపాలైంది. ఆమె ఒంటిపై ఉన్న రెండు తులాల బంగారంఎత్తుకెళ్లాడు.




 ఇకపోతే తీవ్ర గాయాలపాలైన మహిళ రక్తపుమడుగులో ఇంట్లో పడి ఉంది. స్థానికులు ఏదో పని నిమిత్తం ఇంట్లోకి వచ్చిన సమయంలో ఇక రక్తపుమడుగులో పడి ఉన్న సదరు మహిళను గమనించి ఒక్కసారిగా షాకయ్యారు. ఇక వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వనస్థలిపురం ఏసీపి  పురుషోత్తం రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.  ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: