పెంపుడు జంతువులకు ఉచితంగా కరోనా టెస్ట్.. ఎక్కడో తెలుసా..?

praveen
చైనాలో వెలుగు లోకి వచ్చిన కరోనా  వైరస్ ప్రపంచం మొత్తం ఎంత అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలను మొత్తం అట్టుడికించింది  ఈ మహమ్మారి వైరస్. ఈ క్రమం లోనే ప్రపంచ దేశాలు కరోనా వైరస్ కట్టడి చేయడంలో తీవ్రంగా శ్రమించాయి  అన్న విషయం తెలిసిందే. ఇప్పటికి కూడా కొన్ని దేశాలు కరోనా  వైరస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నాయి.  కరోనా  వైరస్ రోగులను గుర్తించడమే ప్రప్రథమంగా పెట్టుకొని శరవేగంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాయి ప్రపంచ దేశాలు అనే విషయం తెలిసిందే.



 అయితే కేవలం మనుషులకు మాత్రమే కాదు మనుషులకు కరోనా వైరస్ సోకిన తర్వాత వారికి సమీపం లో ఉండే పెంపుడు జంతువులకు కూడా కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉంది అని పలు సర్వేల్లో వెల్లడైన నేపథ్యం లో ప్రస్తుతం ఆయా దేశాలు మరింత అప్రమత్తంగా అవుతున్నాయి. కేవలం మనుషులకు శరవేగంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడమే  కాదు ఇక పెంపుడు జంతువులకు కూడా కరోనా వ్యాధి పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారూ అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే దక్షిణ కొరియా రాజధాని సియోల్లో శునకాలు పిల్లలు వంటి పెంపుడు జంతువులకు ఉచితంగా కరోనా పరీక్షను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు అధికారులు. కరోనా వైరస్ బారిన పడిన మనుషులకు సమీపంలోగల జంతువులకు కరోనా వైరస్ లక్షణాలు కనిపించే వాటికి ఈ వెసులుబాటు కల్పించారు. ఇటీవలే దేశంలోని జంజు  నగరంలో తల్లీ కూతుళ్లకు కరోనా వైరస్ రాగా  వారి పెంపుడు జంతువైన పిల్లికి కూడా కరోనా వచ్చినట్లు తేలింది. ఈ నేపథ్యంలో పెంపుడు జంతువులలో  కరోనా కు సంబంధించి ఏ లక్షణాలు కనిపించినా ఉచితంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: