ప్లాస్టిక్ ఈలతో ఆడుకున్న బాలిక.. నిమిషాల్లో ప్రాణం పోయింది..

praveen
మృత్యువు ఎప్పుడు ఎటు నుంచి వచ్చి కబలిస్తుంది అన్నది ఊహకందని విధంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అంతా సాఫీగా సంతోషంగా జరిగిపోతుంది అనుకుంటున్న తరుణంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు పోయే ఘటనలు కూడా చోటుచేసుకుంటాయి అన్న విషయం తెలిసిందే. అందుకే మనుషుల ప్రాణాలకు గ్యారెంటీ లేదు అని చెబుతూ ఉంటారు పెద్దలు.  కొన్నిసార్లు రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఒక వాహనదారుడు సరిగ్గా వెళ్లినప్పటికీ మరో వాహనదారులు నిబంధనలు అతిక్రమించి అతివేగంగా రావడం కారణంగా.. ఒకరు చేసిన తప్పుకి మరొకరు ప్రాణాలు కోల్పోవాల్సిన  ఘటనలు కూడా తెరమీదికి వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.



 ఇక ఈ మధ్య కాలంలో అయితే కొన్ని చిత్రవిచిత్రమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  ఈ మధ్య కాలంలో కొంతమంది వ్యక్తులు బ్రష్ చేసుకుంటూ ఏకంగా టూత్ బ్రష్ మింగేయటం  లాంటి ఘటనలు తెర మీదికి వస్తున్నాయి  అన్న విషయం తెలిసిందే. ఇక అవస్థలు పడి డాక్టర్ దగ్గరికి వెళ్లి ఎలాగోలా ఇక కడుపులో ఉన్న బ్రెష్  ని బయటకి తీయించుకున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన చోటు చేసుకుంది. కానీచివరికి విషాదంగా ముగిసింది. అప్పుడు వరకు ఎంతో సంతోషంగా ఆడుకుంటున్న బాలిక కేవలం నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయింది.  ప్లాస్టిక్ విజిల్ కాస్త గొంతులో ఇరుక్కుపోయి అడ్డుపడటంతో బాలిక విలవిలలాడుతూ చనిపోయింది



 ఈ విషాదకర ఘటన బీహార్లో వెలుగులోకి వచ్చింది. ఎనిమిదేళ్ల బాలిక ఎంతో సంతోషంగా స్నేహితులతో కలిసి ఆడుకుంటుంది ఈ క్రమంలోనే బాలిక వద్ద ఒక ప్లాస్టిక్ ఈల ఉండగా.. దానితో  స్నేహితులతోస్నేహితులతో ఆడుకుంటుంది బాలిక. ఈ క్రమంలోనే  పొరపాటున అది గొంతు లోకి వెళ్లి పోయింది. ఇక అక్కడే ఇరుక్కుపోవడం తో బాలిక ఊపిరాడక కేవలం నిమిషాల వ్యవధిలోనే అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: