జగడ్డ: ఆ రెండు నియోజకవర్గాల్లో... మళ్లీ నిమ్మగడ్డ ఝలక్..?

Chakravarthi Kalyan
ఏపీ సర్కారుకు మళ్లీ నిమ్మగడ్డ జలక్ ఇవ్వబోతున్నారా.. ఆ రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలు రద్దు చేసి మళ్లీ రీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారా.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌.. ఎందుకంటే.. మాచర్ల, పుంగనూరు నియోజకవర్గాల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది.  మాచర్ల, పుంగనూరు నియోజకవర్గాల్లో పోలీసులు, అధికారులు వైసీపీతో కుమ్మక్కయ్యారని ఆ పార్టీ మండిపడుతోంది.

ఈ విషయంపై ఈ రెండు నియోజకవర్గాల్లోని పంచాయితీ ఎన్నికలకు రీనోటిఫికేషన్ ఇవ్వాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ రెండుచోట్లా  వైసీపీ  అక్రమాలకు పాల్పడుతోందంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు లేఖ రాశారు. పుంగనూరు ఎస్సై ఉమామహేశ్వర్ రావు, చౌడేపల్లి రూరల్ ఎస్సై మధుసూధన్ రెడ్డి, సోమల ఎస్సై లక్ష్మీకాంత్, సదుం ఎస్సై ధరణిధర్, కొల్లూరు ఎస్సై శ్రీనివాసులు పై ఫిర్యాదు చేశారు. మాచర్లలో రూరల్ ఎస్సై బత్తవత్సల రెడ్డి, దుర్గి ఎస్సై ఎం. రామాంజనేయులు, వెల్దుర్తి ఎస్సై సుధీర్, కారెంపూడి ఎస్సై రవికృష్ణ, రెంటచింతల ఎస్సై చల్లా సురేష్, మాచర్ల ఎస్సై ఉదయలక్ష్మి, నాగార్జున సాగర్ ఎస్సై పాల్ రవీందర్ లపైనా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

మాచర్ల, పుంగనూరులలో పనిచేస్తున్న ఎం.ఆర్.ఓలు, ఎంపీడీవోలు, పోలీసు అధికారులను అక్కడ నుంచి బదిలీ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.  అభ్యర్థులపై వైకాపా దాడులు చేస్తుంటే, నామినేషన్లు వేయకూడదంటూ ఓ వర్గం పోలీసులు వారితో కుమ్మక్కై అభ్యర్థుల్ని బెదిరిస్తున్నారని చంద్రబాబు అంటున్నారు. పుంగనూరు నియోజకవర్గంలోని సదుం, సోమల మండలాల్లో టీడీపీ   బలపరిచిన అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, పుంగనూరు మండల ఎస్సై ఉమామహేశ్వర్ రావు, ఎంపిడిఓ లక్ష్మీకాంత్ లు ప్రతిపక్ష అభ్యర్ధులను బెదిరించారని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు లేఖపై సీరియస్ గా ఆలోచిస్తున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఆ రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలు వాయిదా వేసే ఆలోచన చేస్తున్నారట. అక్కడ మళ్లీ రీనోటిఫికేషన్ ఇచ్చే అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: