మొదటి సారి ఓటేస్తున్నారా..? ఐతే ఇలా అస్సలు చేయొద్దు...?
అయితే ఆంధ్రాలో 8 ఏళ్ల తర్వాత జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో చాలా మంది మొదటిసారిగా ఓటు వేయబోతున్నారు. కాగా ఇలా మొదటి సారి తమ ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత జనరేషన్ లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరి చేతిలో చూసినా సెల్ ఫోన్ ఉంటోంది... కాస్త డిఫరెంట్ అనిపిస్తే చాలు సెల్ఫీ మీద సెల్ఫీలు తీసుకోవడం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం అలవాటైపోయింది. కానీ ఈ అలవాటు ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద కుదరదు అంటున్నారు అధికారులు. సెల్ఫీలు సంగతి పక్కన పెడితే ...పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ తో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడం నిషేధం.
ఎవరైనా ఈ రూల్ ను అతిక్రమించి ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో సెల్ఫీలు తీసుకుంటే... 17(A) ప్రకారం వారి ఓటును రద్దు చేస్తారు. అంతేకాదు అలా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు అవుతాయి. కాబట్టి ఫస్ట్ టైం ఓటర్స్ ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ తీసుకెళ్ళకండి. ఇక పోలింగ్ కేంద్రంలో వారి అభ్యర్థుల తరపున నినాదాలు చేయడం, వారికి జేజేలు పలకడం, అభ్యర్థికి సంబంధించిన ఫోటోలు, కరపత్రాలు నేరుగా పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లడం నిషేధం. అలా చేస్తే ఎన్నికల నియమావళి అతిక్రమించిన కారణంగా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. కాబట్టి కొత్తగా ఎవరైతే ఓటు వేస్తున్నారో వారు ఈ విషయాన్ని తెలుసుకుని ఫాలో అవడం మంచిది.