జగనన్న ఆ కళల పద్మను ఆదుకుంటాడా...?
పూర్వం నుండి 64 కళలు అంటూ ఊదరగొట్టిన మన పెద్దోళ్ళు... చిత్రలేఖనానికి అనగా మన పెయింటింగ్ మరియు డ్రాయింగ్ కి కేటాయించిన నెంబర్ పెద్ద కన్ఫ్యూషన్. పద్మ అనే ఈ కళాకారిణికి చిన్నప్పుడు వాళ్ల నాన్న గీసిన పెన్సిల్ డ్రాయింగ్ లే స్ఫూర్తి.
నల్లమ్మాయి అంటూ ఎగతాళి చేసే తోటి పిల్లల ఎత్తిపొడుపుల నుండి తప్పించుకోవడానికి.. ప్రశాంతత కోసం ఎంచుకున్న మార్గమే ఈ పెన్సిల్ డ్రాయింగ్. క్యాలెండర్ పేజీలు చిరిగినా, ఆ తర్వాత తిరిగి పోయినా... కంప్యూటర్ యుగం లోకి ఎంటర్ అయ్యాక.. ఆమె చేతిలో పెన్సిల్ కాస్త కంప్యూటర్ పెన్నుగా మారిపోయింది. పద్మకు బొమ్మలు గీయడమే వృత్తి ప్రవృత్తి కూడా. చిన్నప్పుడు నాన్న గీసే బొమ్మలు చూసి అలానే ప్రాక్టీస్ చేసేది, దాంతో చదువుపై శ్రద్ధ తగ్గి డ్రాయింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగింది పద్మకు. అయితే ఈ ఆర్టుకు పెద్దగా కెరియర్ ఉండదని ఆమె తండ్రి పెద్దగా ప్రోత్సహించ లేదట... అయినప్పటికీ పట్టువదలకుండా తన కళను కంటిన్యూ చేసింది. బిఎస్సీ డిగ్రీ కంప్లీట్ చేసింది. యానిమేషన్లో కొంతకాలం జాబ్ కూడా చేసింది.
తనకున్న పెయింటింగ్ కళ ను అభివృద్ధి చేసుకోవడానికి ఆర్థిక పరిస్థితులు సహకరించక పోయినప్పటికీ... ఇంటర్నెట్ ను ఉపయోగించుకొని తన ప్రతిభకు మరింత పదును పెడుతోంది పద్మ. డిజిటల్ పెయింటింగ్ స్టార్ట్ చేసింది. తన భర్త కృష్ణ సీఎం జగన్ గారి బొమ్మ వేయమనడంతో డిజిటల్ కంప్యూటర్ పై వేసింది. ఆ పోర్ట్రైట్ ఎంతో అద్భుతంగా అచ్చు జగనన్న లాగే ఉండడం ఆశ్చర్యం. ఆమె టాలెంట్ ను నిజంగా మెచ్చుకొని తీరాలి. అయితే దీనిని మన ప్రభుత్వం గమనించి ఆమెకు కావలసిన సహాయసహకారాలు అందిస్తే ఆమె మరింత ముందుకు వెళ్లే అవకాశముంటుంది. దీనికి సంబంధించి మరిన్ని అవకాశాలు ఉన్నాయనేది ఆమెకు ప్రత్యేక శిక్షణ ద్వారా తెలియచేస్తే ఆ రంగంలో నిష్ణాతురాలవుతుంది...మరి దీనికి జగన్ ఏమైనా స్పందిస్తారో లేదో చూడాలి.