చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా.. చెక్ పెట్టండి ఇలా..?
అయితే జుట్టురాలే సమస్యకు చుండ్రు ప్రధాన కారణం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తలలో చుండ్రు పెరిగిపోవడం వల్ల ఇక జుట్టు రాలే సమస్య మొదలవుతుంది. ఇక ఆ తర్వాత ఈ సమస్య తీవ్రమై వేగంగా బట్టతల వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే చుండ్రును నివారిస్తే జుట్టు బలంగా ఉంచడానికి అవకాశం ఉంది అని నిపుణులు ఎప్పటికప్పుడు సూచిస్తూ ఉంటారు. అందుకే చుండ్రును నివారించేందుకు ఎంతో మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ చివరికి ఆ ప్రయత్నాలు చుండ్రును నివారించ లేకపోవడంతో ఇక తీవ్ర నిరాశ చెందుతూ ఉంటారు.
అయితే మూడు రోజులకు ఒకసారి షాంపూతో తలస్నానం చేయడం.. మీకోసం ఒక సపరేటు దువ్వెన వాడటం.. అంతేకాకుండా సరైన సమయంలో నిద్రపోవడం లాంటివి చేస్తే చుండ్రు సమస్యను నివారించవచ్చట. అంతేకాకుండా తులసి ఆకులతో కూడా సమస్యలకు చెక్ పెట్టవచ్చట. తులసి ఆకులు తీసుకుని అందులో రెండు టీ స్పూన్ల ఉసిరి పొడి కలిపి దానిని పేస్టులా చేసుకుని ఆ తర్వాత తలకి మర్దన చేసుకోవాలి. ఒక అరగంట తర్వాత కడిగేయాలి ఇలా చేయడం ద్వారా ఇక కుదుళ్లు బలంగా ఉండడంతో పాటు పూర్తిగా చుండ్రు సమస్య తలెత్తే అవకాశం ఉందని మంచి ప్రయోజనం ఉంటుంది అని నిపుణులు సూచిస్తున్నారు.