జగడ్డ: ఒకవైపు పోలింగ్.. మరోవైపు ప్రచారం.. గెలుపుకుదారేది..?
విషయానికొస్తే.. నగిరిలో వైసీపీ నేతల దూకుడు కొనసాగుతుంది.. ఎన్నడూ లేని విధంగా ప్రత్యర్థులకు సవాల్ చేస్తున్నారు.ఐదు మండలాల్లోని 87 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. ముందస్తుగా 22 పంచాయతీలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే.. దీంతో మిగిలిన పంచాయతీల్లో 64 వైసీపీ మద్ద తుదారులు, 18 టీడీపీ మద్దతుదారులు దక్కించుకున్నారు. ఇకపోతే నలుగురు ఇండి పెండెంట్లు ఎన్నికల్లో గెలుపొందారు. విజ యపురం మండలంలో బీజేపీ అభ్యర్థి శాంతి గెలుపొందారు. ఇక వడమాలపేట మండలంలో 14 పంచాయతీల్లో ఒకటి ఏకగ్రీవమైంది. దీంతో 11 పంచాయతీ సర్పంచ్ స్థానాలు వైసీపీ, రెండు టీడీపీ, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయాన్ని దక్కించుకున్నారు.
జిల్లా వ్యాప్తంగా వైసీపీ పంతం నెగ్గెలా ఉంది.. చాలా వరకు ఏకగ్రీవాలు వెల్లు విరిస్తున్నాయి..నగిరి లో బీకర కుప్పం మండలంలో ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ పంచాయతీ సర్పంచ్ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడ్డారు. ప్రధానంగా టీడీపీ, వైసీపీ మద్దతుదారుల నడుమ పోటీ జరిగింది. ఎవరికి వారు గెలుపు సవాల్‌గా తీసుకుని ప్రచారం చేశారు. అయితే లెక్కింపులో ఇద్దరికీ సమానంగా రావడంతో మరోసారి ఎన్నికల లెక్కింపును చేపట్టారు. ఈ మేరకు టీడీపీ మద్దతు దారుడికి విజయం దక్కింది. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి కనపడుతోంది. రెండో విడత ఎన్నికల్లో ఏ పార్టీ జెండాను పాతుందో చూడాలి..