రాత్రి 8 తర్వాత తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..?
అయితే రాత్రి 8 గంటల లోపు ప్రతి ఒక్కరు ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు అని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఒక ఇటీవల నిర్వహించిన సర్వే కూడా ఇదే చెబుతుంది. రాత్రి 8 గంటల తర్వాత ఎవరైనా ఆహారం తీసుకుంటే.. వారి శరీరంలో బాడీ మాస్ ఇండెక్స్ అధికశాతంలో పెరుగుతుంది అని సర్వేలో వెల్లడైనట్లు తెలిపారు పరిశోధకులు. ఎవరైతే రాత్రి 8 గంటలకు ముందు ఆహారం తీసుకుంటారో .. వారి శరీరంలో మాత్రం బాడీ మాస్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించామని పరిశోధకులు వెల్లడించారు
రాత్రి 8 గంటల తర్వాత ఎవరైతే స్నాక్స్ రూపంలో కానీ లేదా ఆహారం రూపంలో గానీ ఏదైనా తీసుకుంటే శరీరంలో కొవ్వు శాతం చాలా ఎక్కువగా పెరిగి లావుగా అయిపోయే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా రాత్రి సమయం లోనే కాదు పగటి సమయంలో కూడా ఎక్కువ కాలరీలు తీసుకునేవరిలో కాస్త తేడా ఉన్నట్లు వెల్లడించారు. ఆహారం తీసుకునే విధామే కాదు నిద్ర కూడా అతని ఆరోగ్యం సరిగ్గా ఉండటం పై కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్పుకొచ్చారు. ఎంతోమంది రాత్రి సమయంలో సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్లే ప్రభుత్వం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.