మరో మహిళతో నగ్నంగా భర్త.. భార్య ఏం చేసిందో తెలుసా..?
ఇక్కడ ఇలాంటి దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఏకంగా కట్టుకున్న భార్య కళ్ళు కప్పి మరో మహిళతో వివాహేతర సంబంధానికి తెరలేపాడు. ఇక ఎన్నో రోజుల పాటు భార్యకు తెలియకుండా ప్రియురాలితో రాసలీలలు కొనసాగించాడు. చివరికి ఆ నోటా ఈ నోటా పడి కట్టుకున్న భార్యకు అసలు విషయం తెలిసిపోయింది. ఈ క్రమంలోనే సరైన సమయం కోసం ఎదురు చూసిన సదరు మహిళ భర్త ప్రియురాలితో ఏకాంతంగా గడుపుతు ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నది. ఈ ఘటన బీహార్లో వెలుగులోకి వచ్చింది.
చాప్రా కు చెందిన కుమార్ అనే వ్యక్తి ఈవెంట్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఇక ఇతనికి కోర్టు కాలనీకి చెందిన యువతితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. చాన్నాళ్ళ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ గత కొన్ని రోజుల నుంచి మాత్రం భార్యాపిల్లలతో తరచు గొడవపడుతున్నాడు కుమార్. ఇక ఈ క్రమంలోనే మరో మహిళతో భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అన్న విషయం భార్య చెవిన పడింది. ఇక ఆ తర్వాత భర్త పై నిఘా పెంచింది భార్య. రోజు ఉదయాన్నే ఆఫీసుకి వెళ్తున్నాను అని చెప్పి మరో మహిళను దగ్గరికి భర్త వెళ్తున్నట్లు గుర్తించింది. ఇక ఇటీవలే భర్త ప్రియురాలి ఇంటికి వెళ్లి రాసలీలల్లో మునిగి తేలిన సమయంలో బంధువుల సహాయంతో భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసింది. అనంతరం పోలీసులకు అప్పగించింది సదరు మహిళ.