జగడ్డ: పంచాయతీ ఎన్నికల్లో.. రికార్డు మెజారిటీ ఎక్కడో తెలుసా..?
ఇక ఈ ఎన్నికల్లో అనేక వింతలు, విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్క ఓటుతో గెలిచిన వారు కొందరు.. మొత్తం సమానంగా ఓట్లు వచ్చి టాస్ ఆధారంగా విజేతగా నిలిచిన వారు ఇంకొందరు.. మరి కొందరికి అసలు ఒక్క ఓటు కూడా రాని రికార్డులు కూడా ఉన్నాయి. ఇంకొందరు.. అతి తక్కువ మెజారిటీతో గట్టెక్కిన వారు.. ఇలా ఈ పంచాయతీ ఎన్నికల్లోనూ ఎన్నో వింతలు.. విశేషాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రతి ఎన్నికల్లోనూ సాధారణమే.
అసలు పంచాయతీ ఎన్నికల్లో గెలుపే ప్రధానం.. మెజార్టీ ఎంతన్నది అంత విషయం కాదు.. ఎందుకంటే.. ఉండే ఓటర్లే చాలా తక్కువ.. అందుకే.. 500 దాటి మెజారిటీ సాధిస్తే మంచి విజయం కిందే లెక్క. అయితే ఇప్పటి వరకూ ఏపీ మొత్తం మీద.. అత్యధిక రికార్డు మెజారిటీ ఎవరిది.. ఎక్కడ.. ఈ విషయం మీకు తెలుసా.. అది కృష్ణా జిల్లాలోనే.. ఇంతకీ ఆ విజయం ఎక్కడో తెలుసా.. పామర్రు పంచాయతీ.
పామర్రు పంచాయతీలో శ్రీమతి కేతువతి కస్తూరి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించారు.. ఎన్ని ఓట్ల మెజారిటీ అంటే.. 5644.. అక్షరాలా.. ఐదు వేల ఆరువందల నలభై నాలుగు ఓట్ల మెజారిటీ అన్నమాట. ఇంతకీ ఏ పార్టీయో చెప్పలేదు.. కదా.. అధికార పార్టీ వైసీపీ ఈ సీటు దక్కించుకుంది. ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.